నెల్లూరు వైసీపీ కార్యాలయంలో మైనారిటీ నేతల సందడి
నెల్లూరు రాంజీనగర్‌లోని వైఎస్ఆర్సీపీ సిటీ కార్యాలయం మైనారిటీ నేతలు, కార్యకర్తలతో సందడిగా మారింది. జమీర్‌కు రాష్ట్ర మైనారిటీ సెల్ స్టేట్ సెక్రటరీ, ఖాదర్ ఖాన్‌కు నగర మైనారిటీ సెల్ ఉపాధ్యక్షుడు, నిషాద్‌కు సిటీ మైనారిటీ సెల్ జనరల్ సెక్రటరీ పదవులు లభించడంతో సుమారు 100 మంది కార్యకర్తలు కార్యాలయానికి చేరుకుని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి నేతలు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేసి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి పనిచేయాలని ఎమ్మెల్సీ సూచించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మరోసారి పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యమని మైనారిటీ నేతలు స్పష్టం చేశారు.

నెల్లూరు వైసీపీ కార్యాలయంలో మైనారిటీ నేతల సందడి
నెల్లూరు వైసీపీ కార్యాలయంలో మైనారిటీ నేతల సందడి నెల్లూరు రాంజీనగర్‌లోని వైఎస్ఆర్సీపీ సిటీ కార్యాలయం మైనారిటీ నేతలు, కార్యకర్తలతో సందడిగా మారింది. జమీర్‌కు రాష్ట్ర మైనారిటీ సెల్ స్టేట్ సెక్రటరీ, ఖాదర్ ఖాన్‌కు నగర మైనారిటీ సెల్ ఉపాధ్యక్షుడు, నిషాద్‌కు సిటీ మైనారిటీ సెల్ జనరల్ సెక్రటరీ పదవులు లభించడంతో సుమారు 100 మంది కార్యకర్తలు కార్యాలయానికి చేరుకుని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి నేతలు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేసి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి పనిచేయాలని ఎమ్మెల్సీ సూచించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మరోసారి పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యమని మైనారిటీ నేతలు స్పష్టం చేశారు.

