వేసవి సెలవుల దృష్ట్యా ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు దక్షిణ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. తాంబరం-సంత్రాగచ్చి, తాంబరం-బోడినాయకనూరు మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. ఈ రైళ్లు నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, రాజమండ్రి మీదుగా రాకపోకలు సాగిస్తాయి. జూన్ 14 వరకు అందుబాటులో ఉండే ఈ వీక్లీ స్పెషల్ ఎక్స్ప్రెస్ రైళ్లకు ముందస్తు రిజర్వేషన్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. రైల్వే శాఖ తీసుకున్న ఈ నిర్ణయంతో తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు ఎంతో ఊరట లభించనుంది.

నెల్లూరు : ప్రయాణికులకు గుడ్ న్యూస్.. నెల్లూరు మీదుగా ప్రత్యేక రైళ్లు!