Thursday, 30 April 2026
  • Home  
  • నెల్లూరు జిల్లాలో పెట్రోల్ కొరత వదంతులు అసత్యం – ఎస్పీ అజిత వేజెండ్ల హెచ్చరిక
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరు జిల్లాలో పెట్రోల్ కొరత వదంతులు అసత్యం – ఎస్పీ అజిత వేజెండ్ల హెచ్చరిక

నెల్లూరు జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందన్న వదంతులు పూర్తిగా అసత్యమని జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల, ఐపీఎస్ స్పష్టం చేశారు. జిల్లాలోని అన్ని పెట్రోల్ బంక్ల వద్ద ఇంధనం సమృద్ధిగా అందుబాటులో ఉందని తెలిపారు. ప్రజలు అపోహలకు లోనుకాకుండా సాధారణంగా ఇంధనం వినియోగించాలన్నారు. కొంతమంది కావాలనే కృత్రిమ కొరత సృష్టించేందుకు ప్రయత్నిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పరిస్థితిని పోలీసులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు. వాహనదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.