కాకినాడలో ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు దారితీసిన ఘటన లవ్ జిహాదీ కోణంలో జరిగిందని బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించి నిందితుడు సాదిక్ ఖాన్ దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై ఆయన పోలీసు యంత్రాంగానికి ధన్యవాదాలు తెలిపారు. హిందూ సమాజం హిందూ ధర్మాన్ని లక్ష్యంగా చేసుకుని కొందరు మతోన్మాదులు లవ్ జిహాదీ కుట్రలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కాకినాడ ఘటనపై అన్ని కోణాల్లోనూ సమగ్ర దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందని డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులు నిందితుడు సాదిక్ ఖాన్ పాత్ర అతనితో కుటుంబానికి ఉన్న సంబంధాలు తదితర అంశాలపై లోతైన దర్యాప్తు జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని ఆయన కోరారు. నిందితుడిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని రాష్ట్ర హోంమంత్రి డీజీపీతో పాటు పోలీసు ఉన్నతాధికారులను ఆయన కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజల్లో భద్రతా భావాన్ని కల్పించడంతో పాటు కుట్రలకు పాల్పడే వ్యక్తులపై చట్టప్రకారం కఠినంగా వ్యవహరించాలని డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి కోరారు.

నూకరాజు కుటుంబం ఆత్మహత్యపై సమగ్ర దర్యాప్తు చేయాలి*