నెల్లూరు నగర కార్పొరేషన్ 14వ డివిజన్ పరిధిలోని వేపదరువు సమీపంలో రూ.40 లక్షల నుడా సాధారణ నిధుల అంచనాలతో నిర్మించిన నుడా పార్కును ఈ నెల 26వ తేదీ సాయంత్రం 5 గంటలకు ప్రారంభించనున్నట్లు రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ ఉచ్చి భువనేశ్వర ప్రసాద్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పార్కుకు మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ ఆనం వివేకానందరెడ్డి పేరు పెట్టినట్లు ఆయన తెలియజేశారు.
పార్కు ప్రారంభోత్సవానికి రాష్ట్ర మంత్రులు పి. నారాయణ, ఆనం రామనారాయణరెడ్డి, ఎం.డి. ఫరూక్ ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారని, అలాగే జిల్లాకు చెందిన ఎమ్మెల్సీలు, రాజ్యసభ ఎంపీ బీద మస్తాన్‌రావు, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి తదితరులు గౌరవ అతిథులుగా విచ్చేస్తున్నారని ఆయన ఆ ప్రకటనలో తెలిపారు. నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు.
పార్కు లోపల ఆనం వివేకానందరెడ్డి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారని, ఈ సందర్భంగా ఆ విగ్రహ ప్రారంభ కార్యక్రమం కూడా జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు హాజరై విజయవంతం చేయాలని భువనేశ్వర ప్రసాద్ విజ్ఞప్తి చేశారు.


