Thursday, 18 June 2026
  • Home  
  • నీట్ యూజీ-2026 అభ్యర్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం* *జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి*
- ఆంధ్రప్రదేశ్

నీట్ యూజీ-2026 అభ్యర్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం* *జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి*

విశాఖపట్నం నీట్ యూజీ-2026 పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు (స్త్రీ, పురుషులకు) జూన్ 21న ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించినట్లు జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి ఓ ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు తమ నూతన ఒరిజినల్ హాల్ టికెట్ చూపించి మాత్రమే ఉచితంగా ప్రయాణించవచ్చని, పాత హాల్ టికెట్లు, ఫోటోకాపీలు లేదా ఇతర పత్రాలు చెల్లవని స్పష్టం చేశారు. ఈ సౌకర్యం పరీక్ష రోజు మాత్రమే అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకునేలా ముందుగానే ప్రయాణ ప్రణాళిక రూపొందించుకోవాలని, తల్లిదండ్రులు సహకరించాలని కోరారు. విద్యార్థులందరూ ప్రశాంతంగా, ఆత్మవిశ్వాసంతో పరీక్ష రాసి మంచి ఫలితాలు సాధించాలని జాయింట్ కలెక్టర్ ఆకాంక్షించారు.

విశాఖపట్నం

నీట్ యూజీ-2026 పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు (స్త్రీ, పురుషులకు) జూన్ 21న ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించినట్లు జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి ఓ ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు తమ నూతన ఒరిజినల్ హాల్ టికెట్ చూపించి మాత్రమే ఉచితంగా ప్రయాణించవచ్చని, పాత హాల్ టికెట్లు, ఫోటోకాపీలు లేదా ఇతర పత్రాలు చెల్లవని స్పష్టం చేశారు. ఈ సౌకర్యం పరీక్ష రోజు మాత్రమే అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకునేలా ముందుగానే ప్రయాణ ప్రణాళిక రూపొందించుకోవాలని, తల్లిదండ్రులు సహకరించాలని కోరారు. విద్యార్థులందరూ ప్రశాంతంగా, ఆత్మవిశ్వాసంతో పరీక్ష రాసి మంచి ఫలితాలు సాధించాలని జాయింట్ కలెక్టర్ ఆకాంక్షించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.