రంగారెడ్డి జిల్లా , సెప్టెంబర్ , పున్నమి ప్రతినిధి
అబ్దుల్లాపూర్ మెట్టు మండలం హయత్ నగర్ డివిజన్లో కురిసిన భారీ వర్షాల కారణంగా బంజారా కాలనీ పూర్తిగా నీట మునిగింది. స్థానిక డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి, ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్ తో కలిసి మునిగిన ప్రాంతాలను పరిశీలించారు. వాతావరణ శాఖ సూచన మేరకు మరికొన్ని రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వెల్లడించారు. వరద నీటిని మరలించే చర్యలు, విద్యుత్ స్తంభాలు, డ్రైనేజ్ మ్యాన్ హోల్స్ దగ్గర అప్రమత్తత పాటించాలని సూచించారు. కార్యక్రమంలో ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవి రెడ్డి సుధీర్ రెడ్డి, బీజేపీ నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు.


