Friday, 19 June 2026
  • Home  
  • నాలుగు గ్రామాల రైతులతో సుప్రీంకోర్టు న్యాయవాది ప్రియాంక కక్కర్ భేటీ “ఎన్నికల హామీలు ఏమయ్యాయి?.. రైతుల భూములపై బలవంతపు సేకరణ ఎందుకు?” అని ప్రశ్నించిన రైతులు
- News

నాలుగు గ్రామాల రైతులతో సుప్రీంకోర్టు న్యాయవాది ప్రియాంక కక్కర్ భేటీ “ఎన్నికల హామీలు ఏమయ్యాయి?.. రైతుల భూములపై బలవంతపు సేకరణ ఎందుకు?” అని ప్రశ్నించిన రైతులు

నాలుగు గ్రామాల రైతులతో సుప్రీంకోర్టు న్యాయవాది ప్రియాంక కక్కర్ భేటీ “ఎన్నికల హామీలు ఏమయ్యాయి?.. రైతుల భూములపై బలవంతపు సేకరణ ఎందుకు?” అని ప్రశ్నించిన రైతులు ఫార్మాసిటీ ప్రాంతం, జూన్ 19: ఫార్మాసిటీ భూసేకరణ వ్యవహారంపై పోరాటం కొనసాగిస్తున్న నాలుగు గ్రామాల రైతులను సుప్రీంకోర్టు న్యాయవాది ప్రియాంక కక్కర్ శుక్రవారం ప్రత్యక్షంగా కలిసి వారి సమస్యలు, అభిప్రాయాలను తెలుసుకున్నారు. కురిమిద్ద, నానక్‌నగర్, తాడిపర్తి, మేడిపల్లి గ్రామాల్లో పర్యటించిన ఆమె రైతులతో సమావేశమై భూసేకరణకు సంబంధించిన అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ, గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫార్మాసిటీ ప్రాజెక్టును రద్దు చేస్తామని, రైతుల భూములను కాపాడతామని, బలవంతపు భూసేకరణ జరగదని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను విస్మరించి, పోలీసు బలగాల సహాయంతో భూములను స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. రైతులు మాట్లాడుతూ, ప్రస్తుతం భూసేకరణ అంశంపై న్యాయస్థానాల్లో విచారణ కొనసాగుతోందని, హైకోర్టు స్టే ఉన్నప్పటికీ అధికారులు గ్రామాల్లోకి వచ్చి ఒత్తిడి తెస్తున్నారని తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో న్యాయస్థానాల ఆదేశాలను గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని, కానీ వాటిని పక్కనబెట్టి భూములను స్వాధీనం చేసుకునే చర్యలు చేపట్టడం ఆందోళనకరమని పేర్కొన్నారు. అలాగే, దేశవ్యాప్తంగా రాజ్యాంగ పరిరక్షణ గురించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారని, కానీ తెలంగాణలో మాత్రం రైతుల హక్కులను కాలరాస్తూ, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల ముందు “ఫార్మాసిటీ రద్దు – మీ భూములు ఇవ్వకండి, మా ప్రభుత్వం వస్తుంది” అని చెప్పిన నాయకులు ఇప్పుడు రైతుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా వ్యవహరించడం బాధాకరమని అన్నారు. రైతుల సమస్యలను శ్రద్ధగా విన్న సుప్రీంకోర్టు న్యాయవాది ప్రియాంక కక్కర్ మాట్లాడుతూ, రైతులు వ్యక్తం చేసిన అభ్యంతరాలు, ఆందోళనలను పూర్తి స్థాయిలో నమోదు చేసుకుంటున్నానని తెలిపారు. భూసేకరణ, న్యాయపరమైన అంశాలు, రైతుల వాదనలు తదితర విషయాలను సంబంధిత స్థాయిలో ప్రస్తావిస్తానని చెప్పారు. రైతులు వెల్లడించిన అంశాలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దృష్టికి కూడా తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చినట్లు సమావేశంలో పాల్గొన్న వారు తెలిపారు. ఫార్మాసిటీ భూసేకరణకు వ్యతిరేకంగా రైతుల పోరాటం కొనసాగుతుందని, భూములు, జీవనాధారాలను కాపాడుకునేందుకు చట్టబద్ధంగా ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తామని రైతులు స్పష్టం చేశారు. తమ అభిప్రాయాలను ప్రభుత్వం గౌరవించాలని, బలవంతపు చర్యలను నిలిపివేసి రైతులతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఫార్మాసిటీ పోరాట కమిటీ ప్రతినిధులు, నాలుగు గ్రామాల రైతులు, సమన్వయకర్త కవుల సరస్వతి, కమిటీ సభ్యులు కాన మౌని, గణేష్, సందీప్ రెడ్డి, దేవోజి, కొండల్ రెడ్డి, లింగం, మైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గ్రామాల వారీగా పెద్ద సంఖ్యలో రైతులు హాజరై తమ అభిప్రాయాలను ప్రియాంక కక్కర్‌కు వివరించారు. “రైతుల హక్కుల పరిరక్షణ, ఇచ్చిన హామీల అమలు, న్యాయస్థానాల ఆదేశాల గౌరవం కోసం పోరాటం కొనసాగుతుంది” అని రైతులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

నాలుగు గ్రామాల రైతులతో సుప్రీంకోర్టు న్యాయవాది ప్రియాంక కక్కర్ భేటీ

“ఎన్నికల హామీలు ఏమయ్యాయి?.. రైతుల భూములపై బలవంతపు సేకరణ ఎందుకు?” అని ప్రశ్నించిన రైతులు

ఫార్మాసిటీ ప్రాంతం, జూన్ 19:
ఫార్మాసిటీ భూసేకరణ వ్యవహారంపై పోరాటం కొనసాగిస్తున్న నాలుగు గ్రామాల రైతులను సుప్రీంకోర్టు న్యాయవాది ప్రియాంక కక్కర్ శుక్రవారం ప్రత్యక్షంగా కలిసి వారి సమస్యలు, అభిప్రాయాలను తెలుసుకున్నారు. కురిమిద్ద, నానక్‌నగర్, తాడిపర్తి, మేడిపల్లి గ్రామాల్లో పర్యటించిన ఆమె రైతులతో సమావేశమై భూసేకరణకు సంబంధించిన అంశాలపై విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ, గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫార్మాసిటీ ప్రాజెక్టును రద్దు చేస్తామని, రైతుల భూములను కాపాడతామని, బలవంతపు భూసేకరణ జరగదని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను విస్మరించి, పోలీసు బలగాల సహాయంతో భూములను స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు.
రైతులు మాట్లాడుతూ, ప్రస్తుతం భూసేకరణ అంశంపై న్యాయస్థానాల్లో విచారణ కొనసాగుతోందని, హైకోర్టు స్టే ఉన్నప్పటికీ అధికారులు గ్రామాల్లోకి వచ్చి ఒత్తిడి తెస్తున్నారని తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో న్యాయస్థానాల ఆదేశాలను గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని, కానీ వాటిని పక్కనబెట్టి భూములను స్వాధీనం చేసుకునే చర్యలు చేపట్టడం ఆందోళనకరమని పేర్కొన్నారు.
అలాగే, దేశవ్యాప్తంగా రాజ్యాంగ పరిరక్షణ గురించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారని, కానీ తెలంగాణలో మాత్రం రైతుల హక్కులను కాలరాస్తూ, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల ముందు “ఫార్మాసిటీ రద్దు – మీ భూములు ఇవ్వకండి, మా ప్రభుత్వం వస్తుంది” అని చెప్పిన నాయకులు ఇప్పుడు రైతుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా వ్యవహరించడం బాధాకరమని అన్నారు.
రైతుల సమస్యలను శ్రద్ధగా విన్న సుప్రీంకోర్టు న్యాయవాది ప్రియాంక కక్కర్ మాట్లాడుతూ, రైతులు వ్యక్తం చేసిన అభ్యంతరాలు, ఆందోళనలను పూర్తి స్థాయిలో నమోదు చేసుకుంటున్నానని తెలిపారు. భూసేకరణ, న్యాయపరమైన అంశాలు, రైతుల వాదనలు తదితర విషయాలను సంబంధిత స్థాయిలో ప్రస్తావిస్తానని చెప్పారు. రైతులు వెల్లడించిన అంశాలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దృష్టికి కూడా తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చినట్లు సమావేశంలో పాల్గొన్న వారు తెలిపారు.
ఫార్మాసిటీ భూసేకరణకు వ్యతిరేకంగా రైతుల పోరాటం కొనసాగుతుందని, భూములు, జీవనాధారాలను కాపాడుకునేందుకు చట్టబద్ధంగా ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తామని రైతులు స్పష్టం చేశారు. తమ అభిప్రాయాలను ప్రభుత్వం గౌరవించాలని, బలవంతపు చర్యలను నిలిపివేసి రైతులతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఫార్మాసిటీ పోరాట కమిటీ ప్రతినిధులు, నాలుగు గ్రామాల రైతులు, సమన్వయకర్త కవుల సరస్వతి, కమిటీ సభ్యులు కాన మౌని, గణేష్, సందీప్ రెడ్డి, దేవోజి, కొండల్ రెడ్డి, లింగం, మైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గ్రామాల వారీగా పెద్ద సంఖ్యలో రైతులు హాజరై తమ అభిప్రాయాలను ప్రియాంక కక్కర్‌కు వివరించారు.
“రైతుల హక్కుల పరిరక్షణ, ఇచ్చిన హామీల అమలు, న్యాయస్థానాల ఆదేశాల గౌరవం కోసం పోరాటం కొనసాగుతుంది” అని రైతులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.