*స్థానిక సంస్థల ఎన్నికలపై తిరుపతి పార్లమెంట్ కోఆర్డినేషన్ టీమ్ ప్రత్యేక దృష్ట్యా.*
*వార్డుల ఆశావహులతో ముఖాముఖి చర్చలు జరిపిన కోఆర్డినేషన్ టీమ్ సభ్యులు బి. విజయ్ కుమార్.*
*ఏఎంసీ చైర్మన్ ఉయ్యాల ప్రవీణ్, మాబాషా ఆధ్వర్యంలో పార్టీ కార్యక్రమాలు.*
*వార్డు స్థాయిలో పార్టీ బలోపేతం, గెలుపే లక్ష్యంగా కార్యాచరణ.. అట్ల కృష్ణారావు*
*విశాలాంధ్ర నాయుడుపేట*
రాబోయే మున్సిపల్ ఎన్నికల సన్నాహాల్లో భాగంగా సూళ్లూరుపేట నియోజకవర్గ జనసేన పార్టీ కార్యకలాపాలను వేగవంతం చేసింది.నాయుడుపేట, సూళ్లూరుపేట పట్టణాల్లో మున్సిపల్ వార్డు ఆశావహులతో మంగళవారం సమన్వయ సమావేశాలు నిర్వహించారు. వార్డుల వారీగా పార్టీ పరిస్థితి, స్థానిక రాజకీయ సమీకరణాలు, ప్రజా సమస్యలు, ఆశావహుల గెలుపు అవకాశాలపై చర్చించారు.తిరుపతి, చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గాల కన్వీనర్, ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు సూచనల మేరకు తిరుపతి పార్లమెంట్ కోఆర్డినేషన్ టీమ్ ప్రతినిధి బి. విజయ్‌కుమార్ సమావేశాల్లో పాల్గొన్నారు. ఆశావహులతో ముఖాముఖిగా మాట్లాడి, ప్రతి వార్డులో పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై సమాలోచనలు జరిపారు.సూళ్లూరుపేట నియోజకవర్గ జనసేన ఇన్చార్జి, నాయుడుపేట ఏఎంసీ చైర్మన్ ఉయ్యాల ప్రవీణ్, స్థానిక సంస్థల సమన్వయ కమిటీ ప్రతినిధి మాబాషా ఆధ్వర్యంలో ఈ సమావేశాలు జరిగాయి. వార్డు స్థాయిలో నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం పెంచి, ప్రజా సమస్యలపై నిరంతరం పనిచేయాలని సూచించారు.మధ్యాహ్నం సూళ్లూరుపేట ఆర్అండ్బీ అతిథిగృహంలో, అనంతరం నాయుడుపేట జనసేన పార్టీ కార్యాలయంలో వార్డు ఆశావహులతో సమావేశాలు నిర్వహించారు.నాయుడుపేటకు వచ్చిన బి. విజయ్‌కుమార్‌కు సీనియర్ నాయకుడు అట్ల కృష్ణారావు స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు.ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడం, ప్రతి వార్డులో కార్యకర్తల బృందాలను ఏర్పాటు చేయడం, ప్రజల్లో పార్టీ విధానాలను విస్తృతంగా తీసుకెళ్లడంపై నాయకులు చర్చించారు.ఈ కార్యక్రమాల్లో రెండు పట్టణాల వార్డు ఆశావహులు, పార్టీ నాయకులు, జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.


