హైదరాబాద్, జూబ్లీహిల్స్: జనసేన పార్టీ పి ఏ సి చైర్మన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నివాసంలో ఆయన తండ్రి, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్‌రావు పెద్దకర్మ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి రైల్వే కోడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్ హాజరై నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా నాదెండ్ల భాస్కర్‌రావు చిత్రపటానికి పూలమాల వేసి గౌరవాంజలి ఘటించిన అరవ శ్రీధర్, ఆయన సేవలను స్మరించుకున్నారు. అనంతరం నాదెండ్ల మనోహర్ సహా కుటుంబ సభ్యులను పరామర్శించి, తన సానుభూతిని వ్యక్తం చేశారు.రాష్ట్ర రాజకీయాల్లో విశిష్ట స్థానాన్ని సంపాదించిన నాదెండ్ల భాస్కర్‌రావు ప్రజాసేవకు అంకితభావంతో పనిచేశారని, ఆయన మరణం రాష్ట్రానికి తీరని లోటని ఈ సందర్భంగా పలువురు నాయకులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమికి చెందిన పలువురు నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొని నాదెండ్ల భాస్కర్‌రావుకు నివాళులు అర్పించారు.

నాదెండ్ల భాస్కర్‌రావుకు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ నివాళి