▶️ వానాకాల సాగుకు నాగర్‌కర్నూల్ జిల్లా రైతులు పొలాలను సిద్ధం చేస్తున్నారు
▶️ పంట అవశేషాల తొలగింపు, దుక్కులు దున్నే పనుల్లో రైతులు బిజీ
▶️ సహజ వ్యవసాయానికి ప్రాధాన్యం.. సేంద్రియ ఎరువుల వినియోగం పెరుగుతోంది
▶️ వర్షాలు కురిసిన వెంటనే విత్తనాలు వేసేందుకు రైతుల సన్నాహాలు
▶️ జిల్లాలో ఈ వానాకాలంలో 6,87,215 ఎకరాల్లో సాగు అంచనా
▶️ ప్రధానంగా పత్తి, వరి, మొక్కజొన్న పంటల సాగు అధికం
▶️ పత్తి సాగు విస్తీర్ణం 3,08,845 ఎకరాలు
▶️ వరి సాగు 1,92,796 ఎకరాల్లో చేపట్టే అవకాశం
▶️ మొక్కజొన్న సాగు 96,992 ఎకరాలకు చేరే అంచనా
▶️ గత రబీ సీజన్లో 6,46,992 ఎకరాల్లో పంటల సాగు
▶️ వానాకాలానికి మొత్తం 59,579 క్వింటాళ్ల విత్తనాల అవసరం
▶️ వరి విత్తనాల అవసరం 48,199 క్వింటాళ్లు
▶️ మొక్కజొన్న విత్తనాల అవసరం 7,779 క్వింటాళ్లు
▶️ పత్తి విత్తనాల అవసరం 2,780 క్వింటాళ్లు
▶️ జిల్లాకు 1,21,881 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమని అంచనా
▶️ యూరియా అవసరం 66,508 మెట్రిక్ టన్నులు
▶️ డీఏపీ అవసరం 14,089 మెట్రిక్ టన్నులు
▶️ కాంప్లెక్స్ ఎరువుల అవసరం 37,203 మెట్రిక్ టన్నులు
▶️ వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతులు
▶️ ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదని రైతుల ఆందోళన
▶️ వర్షాలు ప్రారంభమైన వెంటనే సాగు పనులు వేగవంతం చేస్తామని రైతుల వెల్లడి
▶️ జిల్లా వ్యవసాయ అధికారి యశ్వంత్‌రావు వివరాల వెల్లడి….


