జూలూరుపాడు, ఆగస్టు 5: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని నరసాపురం గిరిజన ఆశ్రమ పాఠశాలలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ నాయకులు ఐటిడీఓ భారతికి వినతిపత్రం అందజేశారు. ఐటిడీఓ భారతి ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన సందర్భంగా, ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి గుగులోతు వంశీ, ఎస్ఎఫ్ఐ మండల కన్వీనర్ పృథ్వి పాఠశాలలో ఉన్న సమస్యలను వివరించారు. వసతి గృహం చుట్టూ విద్యార్థుల భద్రత కోసం ప్రహరీ గోడ నిర్మించాలని, విద్యార్థుల పర్యవేక్షణ కోసం పగలు, రాత్రి వాచ్‌మెన్లను నియమించాలని, అలాగే 15 మంది వర్కర్లను వెంటనే నియమించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా విద్యార్థులకు అందాల్సిన యూనిఫాంలను వెంటనే పంపిణీ చేయాలని, వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని దోమతెరలు అందించాలని కోరారు. ఆశ్రమ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం అత్యవసరంగా పరిష్కరించాలని, లేనిపక్షంలో పెద్దఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కౌన్సిల్ సభ్యులు అనిల్ కుమార్, బాలాజీ, మండల నాయకులు అఖిల్, చింటూ, ఎస్ఎఫ్ఐ మండల నాయకుడు తరుణ్ తదితరులు పాల్గొన్నారు.

నరసాపురం ఆశ్రమ పాఠశాల సమస్యలు వెంటనే పరిష్కరించాలి: ఐటిడీఓకు ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ వినతి