Friday, 2 October 2026
  • Home  
  • నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి: అనంత్ అంబానీ భావోద్వేగ ప్రసంగం (రాష్ట్ర ప్రగతికి నా వంతు తోడ్పాటునందిస్తా: సీఎం చంద్రబాబును కోరిన రిలయన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్)
- చిత్తూరు

నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి: అనంత్ అంబానీ భావోద్వేగ ప్రసంగం (రాష్ట్ర ప్రగతికి నా వంతు తోడ్పాటునందిస్తా: సీఎం చంద్రబాబును కోరిన రిలయన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్)

మదనపల్లె, అక్టోబర్ 02 (పున్నమి న్యూస్ ప్రతినిధి): “నన్ను కూడా ఒక ఆంధ్రా బిడ్డగానే భావించండి.. ఈ రాష్ట్ర అభివృద్ధికి నేనేం చేయాలో నాకు దిశానిర్దేశం (గైడ్) చేయండి” అంటూ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ భావోద్వేగంగా పేర్కొన్నారు. మదనపల్లెలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్లోబల్ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ​ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో పాలుపంచుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఉద్దేశించి ఆయన పేర్కొన్న వ్యాఖ్యలు సభలోని వారందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రసంగం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనంత్ అంబానీని ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని అభినందించారు. వేదికపై ఉన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తదితరులు ఆయన స్పందనను ప్రశంసించారు.

మదనపల్లె, అక్టోబర్ 02 (పున్నమి న్యూస్ ప్రతినిధి):
“నన్ను కూడా ఒక ఆంధ్రా బిడ్డగానే భావించండి.. ఈ రాష్ట్ర అభివృద్ధికి నేనేం చేయాలో నాకు దిశానిర్దేశం (గైడ్) చేయండి” అంటూ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ భావోద్వేగంగా పేర్కొన్నారు. మదనపల్లెలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్లోబల్ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
​ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో పాలుపంచుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఉద్దేశించి ఆయన పేర్కొన్న వ్యాఖ్యలు సభలోని వారందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రసంగం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనంత్ అంబానీని ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని అభినందించారు. వేదికపై ఉన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తదితరులు ఆయన స్పందనను ప్రశంసించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.