ఖమ్మం
నకిలీ బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి ఫైనాన్స్ సంస్థల నుంచి రుణాలు పొందుతూ మోసాలకు పాల్పడుతున్న ముగ్గురిని ఖమ్మం సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీసీఎస్ ఏసీపీ మహ్మద్ సర్వర్ పర్యవేక్షణలో, ఇన్స్పెక్టర్ ఎస్. రాజ్‌కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. నిందితులు ఇసంపల్లి సాయివంశీ (34), షేక్ మహబూబ్ (33), జూపల్లి రాము (35)లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి 11 నకిలీ బంగారు ఉంగరాలు, 35.8 గ్రాముల బరువు, సుమారు రూ.4 లక్షల విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. కొక్కిరేణి సందీప్ (27), ముండాడ రామచందర్ (39) పరారీలో ఉన్నారు. ఎస్ఐ వంశీ, హెడ్ కానిస్టేబుల్ ఓం ప్రకాశ్, కానిస్టేబుళ్లు శ్రీనివాస్, హరి, జానీ, నరసింహారావు, శ్రీధర్, సతీష్‌లను సీపీ సునీల్ దత్ అభినందించారు.



