ఖమ్మం, జూలై
(పున్నమి న్యూస్):
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా దేశవ్యాప్తంగా ‘జెన్ జీ’ విద్యార్థులు సాగించిన ప్రజాస్వామ్య ఉద్యమానికి లభించిన చారిత్రాత్మక విజయమని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పేర్కొన్నారు. మారుతున్న కాలంలో యువత తమ హక్కుల కోసం శాంతియుతంగా పోరాడి కేంద్ర ప్రభుత్వాన్ని నిర్ణయం మార్చుకునేలా చేయడం ప్రజాస్వామ్య బలాన్ని చాటిందన్నారు. విద్యార్థుల న్యాయమైన డిమాండ్లకు మద్దతుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన జన్మదిన వేడుకలను పక్కనబెట్టి విద్యార్థులకు అండగా నిలవడం నాయకత్వానికి నిదర్శనమని కొనియాడారు. యువత సమస్యలను తమ సమస్యలుగా భావించి పోరాటానికి సంఘీభావం తెలపడం అభినందనీయమని అన్నారు. దేశ భవిష్యత్తును నిర్మించే విద్యార్థులు ప్రజాస్వామ్య మార్గంలో తమ హక్కులను సాధించుకోవడం దేశానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఉద్యమంలో పాల్గొని విజయాన్ని సాధించిన ప్రతి విద్యార్థికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ప్రజాస్వామ్య విలువలను కాపాడే ఇలాంటి పోరాటాలు సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తాయని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు.



