Monday, 25 May 2026
  • Home  
  • దుత్తలూరులో ఎంఎస్‌ఎంఈ పార్క్‌కు శంకుస్థాపన
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దుత్తలూరులో ఎంఎస్‌ఎంఈ పార్క్‌కు శంకుస్థాపన

ఉదయగిరి నియోజకవర్గంలోని దుత్తలూరులో రూ.11.50 కోట్ల వ్యయంతో 22 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్న ఎంఎస్‌ఎంఈ పార్క్‌కు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ శంకుస్థాపన చేశారు. మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి, మాజీ జెడ్పీ చైర్మన్ చెంచల్ బాబు యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలను పారిశ్రామిక హబ్‌లుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పార్క్ ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు, మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. పరిశ్రమల స్థాపనతో వలసలు తగ్గి దుత్తలూరు ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.