Thursday, 17 September 2026
  • Home  
  • దళిత రైతుల భూ హక్కు సమస్యలు పరిష్కరించాలి
- కడప

దళిత రైతుల భూ హక్కు సమస్యలు పరిష్కరించాలి

దళిత రైతుల భూ హక్కు సమస్యలను పరిష్కరించి తమకు న్యాయం చేయాలని సిద్ధవటం మండలం మాధవరం-1 పరిధి ఎస్‌కేఆర్ నగర్ కాలనీకి చెందిన దళిత మహిళా రైతులు తహసీల్దార్ విజయ్‌కుమార్‌ను కోరారు. మంగళవారం సిద్ధవటం తహసీల్దార్ కార్యాలయంలో ఆయనను కలిసి తమ సమస్యలను వివరించారు.సోమశిల ముంపు ప్రాంతాల నుంచి పునరావాసం పొందిన తమ కుటుంబాలకు పెద్దపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 1146 నుంచి 1162 వరకు 60 ఎకరాలకు పైగా భూమిని 2012లో రెవెన్యూ అసైన్‌మెంట్ కమిటీలో ఎస్సీ దళిత రైతు కుటుంబాలకు గుర్తించినట్లు తెలిపారు. అయితే ఇప్పటికీ భూ హక్కులకు సంబంధించి సమస్యలు కొనసాగుతున్నాయని, వాటిని పరిష్కరించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. సమస్యను పరిశీలించి పరిష్కారానికి కృషి చేస్తామని తహసీల్దార్ విజయ్‌కుమార్ తెలిపారు. లిఖితపూర్వకంగా వినతిపత్రం సమర్పించాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ మాధవీలత, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ ప్రసాద్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ ప్రతినిధి డేరంగుల శ్రీకాంత్,ఎన్నారై చంద్ర, దళిత మహిళా రైతులు పాల్గొన్నారు.

దళిత రైతుల భూ హక్కు సమస్యలను పరిష్కరించి తమకు న్యాయం చేయాలని సిద్ధవటం మండలం మాధవరం-1 పరిధి ఎస్‌కేఆర్ నగర్ కాలనీకి చెందిన దళిత మహిళా రైతులు తహసీల్దార్ విజయ్‌కుమార్‌ను కోరారు. మంగళవారం సిద్ధవటం తహసీల్దార్ కార్యాలయంలో ఆయనను కలిసి తమ సమస్యలను వివరించారు.సోమశిల ముంపు ప్రాంతాల నుంచి పునరావాసం పొందిన తమ కుటుంబాలకు పెద్దపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 1146 నుంచి 1162 వరకు 60 ఎకరాలకు పైగా భూమిని 2012లో రెవెన్యూ అసైన్‌మెంట్ కమిటీలో ఎస్సీ దళిత రైతు కుటుంబాలకు గుర్తించినట్లు తెలిపారు. అయితే ఇప్పటికీ భూ హక్కులకు సంబంధించి సమస్యలు కొనసాగుతున్నాయని, వాటిని పరిష్కరించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
సమస్యను పరిశీలించి పరిష్కారానికి కృషి చేస్తామని తహసీల్దార్ విజయ్‌కుమార్ తెలిపారు. లిఖితపూర్వకంగా వినతిపత్రం సమర్పించాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ మాధవీలత, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ ప్రసాద్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ ప్రతినిధి డేరంగుల శ్రీకాంత్,ఎన్నారై చంద్ర, దళిత మహిళా రైతులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.