చండ్రగూడెం పంచాయతీలో హుషారుగా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం….
మైలవరం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వసంత కృష్ణ ప్రసాద్ గారి ఆదేశాలతో, మోర్ల వెంకట రోశాలు గారి ఆధ్వర్యంలో, చండ్రగూడెం గ్రామంలో “ఇంటింటికి తెలుగుదేశం పార్టీ” కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది..
ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే 1610కుటుంబాలను ప్రత్యక్షంగా కలిసి, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులు, ప్రజలకు అందుతున్న ప్రయోజనాలను ప్రజలకు వివరించడం జరిగింది..
ఇంకా పంచాయతీలు డోర్ టు డోర్ కార్యక్రమంలో వెళ్లిన ప్రతి ఇంటి దగ్గర వారికి ఏమైనా సమస్యలు ఉంటే తెలియజేయగా ఆ సమస్యలు త్వరలో పరిష్కారం అవుతాయని వారందరికీ తెలియజేయడం జరిగింది
ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి చేరేలా, ప్రజల సమస్యలను తెలుసుకుంటూ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు..
ఈ కార్యక్రమంలో యూనిట్ ఇంచార్జి రాయుడు శ్రీనివాసరావు,పార్టీ వైస్ ప్రెసిడెంట్ కడియం వెంకటేశ్వరావు, బూత్ ఇంచార్జి తాత శ్రీనివాసరావు, స్కూల్ చైర్మన్ మనుబోతుల శ్రీనివాసరావు,బూత్ ఇంచార్జి గడ్డం యోహాను,బాలస్వామి, మాలరపు సాయి, చిట్టిమాధ సాయితదితరులు,బాలస్వామి పాల్గొన్నారు._




