Friday, 17 July 2026
  • Home  
  • తెలుగు భాషోద్యమనేత డాక్టర్ జి .వి .పూర్ణచంద్ కు లోక గురు పురస్కారం అభినందనలు
- News

తెలుగు భాషోద్యమనేత డాక్టర్ జి .వి .పూర్ణచంద్ కు లోక గురు పురస్కారం అభినందనలు

తెలుగు భాషో ద్యమ నేత డాక్టర్ జీ.వి. పూర్ణచందుకు” లోక గురు” పురస్కారం అభినందనలు అమలాపురం జూలై 17 విలువల విద్య, విలువైన విద్యా వ్యాప్తికి కృషిచేసి విద్యార్థి వికాసవాహిని స్వచ్ఛంద సంస్థ ఈ సంవత్సరం ప్రతిష్టాత్మక “లోక గురు” పురస్కారాన్ని తెలుగు భాషాభివృద్ధి, సాహిత్య సేవలు, భాషోద్యమంలో విశిష్ట సేవలు అందించిన ప్రముఖ ఆయుర్వేద వైద్యులు ,ఆహార శాస్త్రవేత్త ,తెలుగు భాషోద్యమ నేత, ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ జీ.వి. పూర్ణచందు కు అందిస్తోంది. గత ఐదు దశాబ్దాలుగా తమ అత్యున్నత ప్రసంగాల ద్వారా రచనల ద్వారా ఆరోగ్య శాస్త్రములో సాహిత్య ప్రక్రియ ల ద్వారా అనేకమంది సామాన్య ప్రజలను విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దినందుకు ఈ లోక గురు పురస్కారాన్ని అందిస్తున్నట్లు విద్యార్థి వికాస వాహిని వ్యవస్థాపక అధ్యక్షులురొటేరియన్ వేములపల్లి కేశవరావు తెలిపారు. ఈ కార్యక్రమం విద్యార్థి వికాసం వాహిని వ్యవస్థాపక దినోత్సవం గురు పూర్ణిమ సందర్భంగా జూలై 29న సాయంత్రం విజయవాడ బెంజ్ సర్కిల్ దగ్గర గల సర్వోత్తమ గ్రంధాలయంలో ఈ పురస్కారాన్ని జీ.వి .పూర్ణచందు కు రిటైర్డ్ హైకోర్టు జడ్జి జస్టిస్ శేష సాయిఅందిస్తారని కేశవ రావు తెలిపారు. ఈ సందర్భంగా లోక గురు పురస్కారం స్వీకరించనున్న తెలుగు భాషోద్యమ నేత , ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ జి .వి. పూర్ణ చందును డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురంలో గల కోనసీమ రచయితల సంఘం, నానీ ల వేదిక, శుక్రవారం అభినందనలు తెలిపింది. సంస్థ అధ్యక్ష కార్యదర్శులు బీ.వి.వీ సత్యనారాయణ, నల్లా నరసింహమూర్తి లు మాట్లాడుతూ తెలుగు భాష పరిరక్షణ , సాహిత్య ప్రచారం , ఆరోగ్య పరిరక్షణ,మాతృభాష పట్ల అవగాహన కల్పించడంలో పూర్ణ చందు చేసిన కృషికి గుర్తింపుగా ఈ పురస్కారం లభించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మరెన్నో అవార్డులు సాధించాలని వారు ఆకాంక్షించారు.

తెలుగు భాషో ద్యమ నేత డాక్టర్ జీ.వి. పూర్ణచందుకు” లోక గురు” పురస్కారం
అభినందనలు

అమలాపురం జూలై 17

విలువల విద్య, విలువైన విద్యా వ్యాప్తికి కృషిచేసి విద్యార్థి వికాసవాహిని స్వచ్ఛంద సంస్థ ఈ సంవత్సరం ప్రతిష్టాత్మక “లోక గురు” పురస్కారాన్ని తెలుగు భాషాభివృద్ధి, సాహిత్య సేవలు, భాషోద్యమంలో విశిష్ట సేవలు అందించిన ప్రముఖ ఆయుర్వేద వైద్యులు ,ఆహార శాస్త్రవేత్త ,తెలుగు భాషోద్యమ నేత, ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ జీ.వి. పూర్ణచందు కు అందిస్తోంది. గత ఐదు దశాబ్దాలుగా తమ అత్యున్నత ప్రసంగాల ద్వారా రచనల ద్వారా ఆరోగ్య శాస్త్రములో సాహిత్య ప్రక్రియ ల ద్వారా అనేకమంది సామాన్య ప్రజలను విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దినందుకు ఈ లోక గురు పురస్కారాన్ని అందిస్తున్నట్లు విద్యార్థి వికాస వాహిని వ్యవస్థాపక అధ్యక్షులురొటేరియన్ వేములపల్లి కేశవరావు తెలిపారు. ఈ కార్యక్రమం విద్యార్థి వికాసం వాహిని వ్యవస్థాపక దినోత్సవం గురు పూర్ణిమ సందర్భంగా జూలై 29న సాయంత్రం విజయవాడ బెంజ్ సర్కిల్ దగ్గర గల సర్వోత్తమ గ్రంధాలయంలో ఈ పురస్కారాన్ని జీ.వి .పూర్ణచందు కు రిటైర్డ్ హైకోర్టు జడ్జి జస్టిస్ శేష సాయిఅందిస్తారని కేశవ రావు తెలిపారు. ఈ సందర్భంగా లోక గురు పురస్కారం స్వీకరించనున్న తెలుగు భాషోద్యమ నేత , ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ జి .వి. పూర్ణ చందును డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురంలో గల కోనసీమ రచయితల సంఘం, నానీ ల వేదిక, శుక్రవారం అభినందనలు తెలిపింది. సంస్థ అధ్యక్ష కార్యదర్శులు బీ.వి.వీ సత్యనారాయణ, నల్లా నరసింహమూర్తి లు మాట్లాడుతూ తెలుగు భాష పరిరక్షణ , సాహిత్య ప్రచారం , ఆరోగ్య పరిరక్షణ,మాతృభాష పట్ల అవగాహన కల్పించడంలో పూర్ణ చందు చేసిన కృషికి గుర్తింపుగా ఈ పురస్కారం లభించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మరెన్నో అవార్డులు సాధించాలని వారు ఆకాంక్షించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.