తెలంగాణలో 70 లక్షల ఓట్లు పోయినట్లే..!
మరో నాలుగు రోజులే గడువు..!
హైదరాబాద్ | రాష్ట్రంలో చేపడుతున్న ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ డిజిటలైజేషన్ ప్రక్రియ గడువు తేదీ నాటికి 80% కూడా దాటే అవకాశాలు కనిపించడం లేదు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 77.86% ఎస్‌ఐఆర్ ప్రక్రియలను మాత్రమే డిజిటలైజేషన్ చేశారు. మొత్తం 3,38,26,448 మంది ఓటర్లు ఉండగా గురువారం సాయంత్రం 6 గంటల వరకు 2,63,37,790 ఓటర్ల వివరాలను మాత్రమే బీఎల్‌ఓలు ఆన్‌లైన్ చేశారు. ఈ నెల 10 వరకు ప్రజల ఆన్‌లైన్‌కు సమయం ఉండగా, ఇందులో చివరి మూడు రోజులు.. రెండో శనివారం, ఆదివారం, సోమవారం (బోనాల పండగ) సెలవులు ఉన్నాయి. ఈ క్రమంలో ప్రజల సమ్మతిలో శుక్రవారం కీలకం కానుంది. దీనిబట్టి రాష్ట్రంలో సుమారు 20% ఓట్లు తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్న్యూమరేషన్ ప్రక్రియ పూర్తీ చేయకుంటే ఆ ఓటును తొలగించాల్సినట్లు తెలుస్తోంది.
గ్రేటర్ పరిధిలో భారీగా తొలగింపు..
రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే భారీగా ఓట్లు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్‌లో 47,36,669 మంది ఓటర్లు ఉండగా 27,42,506 (57.90%) ప్రజలు, మేడ్చల్-మల్కాజిగిరిలో 29,79,130 మంది ఓటర్లకు గాను 18,79,666 (63.09%), రంగారెడ్డిలో 36,99,743 మంది ఓటర్లకు 23,88,886 (64.57%), సంగారెడ్డిలో 14,57,436 మంది ఓటర్లకు 11,50,096 (78.91%), వికారాబాద్‌లో 10,17,671 మంది ఓటర్లకు గాను 8,04,045 (79.01%) ప్రజలకు మాత్రమే డిజిటలైజేషన్ పూర్తి చేశారు. రాష్ట్రంలో అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 94.30%, జనగామలో 91.66%, మహబూబాబాద్‌లో 90.08% ఆన్‌లైన్ ప్రక్రియ పూర్తయింది. మిగతా జిల్లాల్లో 80-90% మధ్యలో జరిగింది. వచ్చే నాలుగు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఒకటిరెండు శాతం పెరిగినా మొత్తంగా 80% కూడా ఆన్‌లైన్ ప్రక్రియ పూర్తవ్వడం అధికారులకు పెద్ద సవాలుగా మారింది.
ఆ వివరాల ఓటరే ఎక్కడ..?
చునిపోవినవారు, చిరునామా లభించనివారు, శాశ్వతంగా వలస వెళ్లినవారు, డూప్లికేట్ ఓట్లు కలిపి మొత్తం 56 లక్షల మందిని ఎస్‌ఐఆర్ సర్వేలో భాగంగా లెక్క చూపుతున్నారు. దాదాపుగా ఈ ఓట్లను తొలగిపోయాయి. దీంతోపాటు మరో 80 లక్షల మంది ఆధార్ (11 రకాల గుర్తింపుపత్రాలు గుర్తించిన) ఓటరు ఉన్నారు. ఇందులో 20% ఓటర్లలో భారి తేడాలు ఉన్నట్టు తెలుస్తోంది. నోటీసు సమయంలో వీరు తగిన గుర్తింపు పత్రాలు చూపకపోతే ఈ ఓట్లు కూడా తొలగిస్తారు. మరోవైపు ఎస్‌ఐఆర్ ప్రక్రియ పూర్తి చేసిన వారిలోనూ అనుమానంగా జరిగిన ఓటు రద్దుకు కూడా నోటీసులు వస్తాయి. వీరి గురించి ప్రజలను ఈలోపు చైతన్యంగా చూడాలి ఉంటుంది.



