*తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ*
మే 15 ఖమ్మం జిల్లా పున్నమి ప్రతినిధి గుగులోత్ భావుసింగ్ నాయక్
ఏన్కూరు:
తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు బట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు ఏన్కూరు మండలంలో ఘనంగా నిర్వహించారు.
మాజీ మండల కాంగ్రెస్ అధ్యక్షులు స్వర్ణ నరేందర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వీట్లు పంచి, కేక్ కట్ చేసి బట్టి విక్రమార్క గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా స్వర్ణ నరేందర్ మాట్లాడుతూ, “బడుగు బలహీన వర్గాల పక్షపాతి, పేద ప్రజల ఆశాజ్యోతి బట్టి విక్రమార్క ఆయన నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. ఆయన ఆయురారోగ్యాలతో, సుదీర్ఘకాలం ప్రజలకు సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం” అని అన్నారు.
ప్రజాసేవలో మీ ప్రయాణం మరింత విజయవంతంగా కొనసాగాలని, మీ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని కోరుకుంటూ…
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు,
సొసైటీ చైర్మన్ శెట్టిపల్లి వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు
స్వర్ణ నరేందర్, మార్కెట్ చైర్మన్ లచ్చిరాం నాయక్, యూత్ అధ్యక్షుడు
నిమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రభావతి రెడ్డి, మాజీ ఎంపీటీసీ మేడ ధర్మారావు, మాజీ మార్కెట్ చైర్మన్ లాలూ నాయక్, రేపల్లె వాడ సర్పంచ్ అజ్మీర
సురేష్ నాయక్, మాజీ సర్పంచ్ మాలోత్ నరసింహారావు,
మైసరావు, చందమామ నరససింహరావు, మాజీ ఎంపీటీసీ వరప్రసాద్, వెంకన్న , గుర్రం రవి, మాచర్ల శ్రీను, పిచ్చయ్య, చిన్న స్వామి, నిమ్మల నరేందర్, గంగుల నాచారం సర్పంచ్, బురదరాఘ పురం సర్పంచ్ భాస్కర్ రావు, పంతగాని నరేష్, ఈవురి సైదులు, బగ్గు నాయక్, రవి, నల్లమల శివకుమార్, తదితరులు పాల్గొన్నారు



