Saturday, 26 September 2026
  • Home  
  • తుఫాన్ ప్రభావంతో కుమారదేవంలో కాలీఫ్లవర్, అరటితోటలకు భారీ నష్టం
- తూర్పు గోదావరి

తుఫాన్ ప్రభావంతో కుమారదేవంలో కాలీఫ్లవర్, అరటితోటలకు భారీ నష్టం

కొవ్వూరు సెప్టెంబర్ 26 పున్నమి న్యూస్ ప్రతినిధి: తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలంలోని కుమారదేవం,పెనకనమెట్ట గ్రామాల్లో తుఫాన్ ప్రభావంతో పరిసర ప్రాంతాల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈదురుగాలులు, భారీ వర్షాల కారణంగా కాలీఫ్లవర్ పంటతో పాటు అరటితోటలు దెబ్బతిన్నాయి. చేతికొచ్చే సమయంలో పంటలు దెబ్బతినడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుమారదేవం ,పెనకనమెట్ట రైతులు ఈరి వీర్రాజు,నామన నాగు లు మాట్లాడుతూ కాలీఫ్లవర్ పంటకు వర్షాలు, గాలుల ప్రభావంతో నష్టం వాటిల్లగా, అరటిచెట్లు నేలకొరిగి పంట పూర్తిగా దెబ్బతిన్నట్లు , సాగు కోసం పెట్టిన పెట్టుబడులు తిరిగి వస్తాయో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, కూలీల ఖర్చులతో భారంగా ఉన్న రైతులకు తుఫాన్ నష్టం మరింత ఆర్థిక ఇబ్బందులను తెచ్చిపెట్టింది. అని అన్నారు,అక్కడి పరిస్థితి చూసి ఆ రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రభుత్వ అధికారులు వెంటనే పంట నష్టాన్ని పరిశీలించి, క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి నష్టపోయిన రైతులకు తగిన పరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు. పంట నష్టం అంచనాలను పారదర్శకంగా నమోదు చేసి, తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

కొవ్వూరు సెప్టెంబర్ 26 పున్నమి న్యూస్ ప్రతినిధి:
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలంలోని కుమారదేవం,పెనకనమెట్ట గ్రామాల్లో తుఫాన్ ప్రభావంతో పరిసర ప్రాంతాల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈదురుగాలులు, భారీ వర్షాల కారణంగా కాలీఫ్లవర్ పంటతో పాటు అరటితోటలు దెబ్బతిన్నాయి. చేతికొచ్చే సమయంలో పంటలు దెబ్బతినడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కుమారదేవం ,పెనకనమెట్ట రైతులు ఈరి వీర్రాజు,నామన నాగు లు మాట్లాడుతూ కాలీఫ్లవర్ పంటకు వర్షాలు, గాలుల ప్రభావంతో నష్టం వాటిల్లగా, అరటిచెట్లు నేలకొరిగి పంట పూర్తిగా దెబ్బతిన్నట్లు , సాగు కోసం పెట్టిన పెట్టుబడులు తిరిగి వస్తాయో లేదో తెలియని పరిస్థితి నెలకొంది.
ఇప్పటికే విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, కూలీల ఖర్చులతో భారంగా ఉన్న రైతులకు తుఫాన్ నష్టం మరింత ఆర్థిక ఇబ్బందులను తెచ్చిపెట్టింది. అని అన్నారు,అక్కడి పరిస్థితి చూసి ఆ రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

ప్రభుత్వ అధికారులు వెంటనే పంట నష్టాన్ని పరిశీలించి, క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి నష్టపోయిన రైతులకు తగిన పరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు. పంట నష్టం అంచనాలను పారదర్శకంగా నమోదు చేసి, తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.