తిరుమలాయపాలెం: తిరుమలాయపాలెం మండల ఎస్సై కూచిపూడి జగదీష్ రోడ్డు ప్రమాదానికి గురైనట్లు సమాచారం. వినాయక నిమజ్జన వేడుకల సందర్భంగా మండలంలోని పలు గ్రామాల్లో విధులు నిర్వహించిన అనంతరం పిండిప్రోలు గ్రామం నుంచి తిరుమలాయపాలెం పోలీస్ స్టేషన్‌కు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. గురువారం అర్ధరాత్రి సుమారు 1 గంట సమయంలో భవాని హోటల్ సమీపంలో ఎస్సై జగదీష్, ఆయన డ్రైవర్ పోలీస్ వాహనంలో ప్రయాణిస్తుండగా లారీ ఢీకొన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో పోలీస్ వాహనం తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.
ప్రమాదంలో ఎస్సై కూచిపూడి జగదీష్‌తో పాటు డ్రైవర్ కొత్తపల్లి రాకేష్‌కు కూడా తీవ్రమైన గాయాలైనట్లు సమాచారం. కాకరవాయి గ్రామానికి చెందిన రాకేష్‌కు తలకు బలమైన గాయాలు అయినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తిరుమలాయపాలెం ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఖమ్మంలోని ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది.

తిరుమలాయపాలెం ఎస్సై కూచిపూడి జగదీష్‌కు రోడ్డు ప్రమాదం లారీ ఢీకొని పోలీస్ వాహనం ధ్వంసం.. ఎస్సైతో పాటు డ్రైవర్‌కు తీవ్ర గాయాలు.
తిరుమలాయపాలెం: తిరుమలాయపాలెం మండల ఎస్సై కూచిపూడి జగదీష్ రోడ్డు ప్రమాదానికి గురైనట్లు సమాచారం. వినాయక నిమజ్జన వేడుకల సందర్భంగా మండలంలోని పలు గ్రామాల్లో విధులు నిర్వహించిన అనంతరం పిండిప్రోలు గ్రామం నుంచి తిరుమలాయపాలెం పోలీస్ స్టేషన్‌కు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. గురువారం అర్ధరాత్రి సుమారు 1 గంట సమయంలో భవాని హోటల్ సమీపంలో ఎస్సై జగదీష్, ఆయన డ్రైవర్ పోలీస్ వాహనంలో ప్రయాణిస్తుండగా లారీ ఢీకొన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో పోలీస్ వాహనం తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ప్రమాదంలో ఎస్సై కూచిపూడి జగదీష్‌తో పాటు డ్రైవర్ కొత్తపల్లి రాకేష్‌కు కూడా తీవ్రమైన గాయాలైనట్లు సమాచారం. కాకరవాయి గ్రామానికి చెందిన రాకేష్‌కు తలకు బలమైన గాయాలు అయినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తిరుమలాయపాలెం ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఖమ్మంలోని ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది.

