తిరుమల ఎక్స్ప్రెస్ కు స్టాపింగ్ కల్పించండి
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి
పులివెందుల జులై 25 పున్నమి ప్రతినిధి
ముద్దనూరు మరియు కమలాపురం రైల్వే స్టేషన్లలో తిరుమల ఎక్స్ప్రెస్ ట్రైన్ కు స్టాపింగ్ కల్పించాలని పార్లమెంట్ సభ్యులు వైయస్ అవినాష్ రెడ్డి సౌత్ కోస్టల్ రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాధుర్ తో అవినాష్ రెడ్డి ఫోన్ లో కోరారు. ఎంపీ చరవాణి లో ఆయన తో మాట్లాడుతూ ప్రజల అవసరాలు మరియు ప్రజల డిమాండ్ ను దృష్టి లో ఉంచుకొని అలాగే విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు ,తరుచుగా నన్ను కలిసి ముద్దనూరు మరియు కమలాపురం స్టేషన్ల లో తిరుమల ఎక్స్ప్రెస్ ట్రైన్ ను ఆపితే ఆయా మండలాల తో పాటు చుట్టూ ప్రక్కల మండలాల ప్రజలకు కుడా సౌకర్యం గా ఉంటుంది అని తెలిపారు.రైల్వే ప్రయాణికుల కోసం పై రెండు స్టేషన్లలో రైల్ నిలుపుదల కోరుతూ తన లేఖను అలాగే ఇటివల వై. యస్. అవినాష్ రెడ్డి ని కలసి “రైల్ నిలుపుదల సాధన కమిటీ “ వారు ఇచిన్న ఆర్జీ ని జతచేసి జీఎం కి పంపారు.


