తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలంలో చంద్రముడి గ్రామాల్లో ఇటీవల జరిగిన ఒక మహిళ అనుమానాస్పద మృతి కేసులో నెల రోజుల తర్వాత విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. కన్నతల్లి ప్రవర్తన నచ్చక, ఊరిలో పరువు పోతోందనే కక్షతో ఆమె కన్నకొడుకే పెట్రోల్ పోసి సజీవ దహనం చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. సంఘటన జరిగిన మొదటి రోజున తల్లిని కాపాడబోయినట్లు పెద్ద కొడుకు సుధీర్ కథ అల్లినప్పటికీ.. ఘటనా స్థలంలో లభించిన క్లూస్, నిందితుడి ప్రవర్తన మరియు అతడు చెప్పిన స్టేట్మెంట్లపై పోలీసులకు బలంగా అనుమానం వచ్చింది. దీనితో నాయుడుపేట రూరల్ సీఐ సంగమేశ్వరరావు, దొరవారిసత్రం ఎస్సై ఎస్ఐ జి.వి. చౌదరిల ఆధ్వర్యంలో పోలీసులు నెల రోజుల పాటు శ్రమించి, పక్కా సాక్ష్యాలు, సాంకేతిక ఆధారాలను (Technical Evidence) సేకరించారు.

తిరుపతి జిల్లా దొరవారిసత్రంలో కన్నతల్లిని పెట్రోల్ పోసి సజీవదహనం చేసిన కసాయి కొడుకు అరెస్ట్