Saturday, 16 May 2026
  • Home  
  • తాళ్లపూడిలో కాలువ గట్టుపై పెరుగుతున్న కబ్జాలు – అధికారుల నిర్లక్ష్యమా?
- తూర్పు గోదావరి

తాళ్లపూడిలో కాలువ గట్టుపై పెరుగుతున్న కబ్జాలు – అధికారుల నిర్లక్ష్యమా?

తాళ్లపూడి, మే 16 (పున్నమి ప్రతినిధి): తూర్పు గోదావరి జిల్లా తాళ్లపూడి మండల పరిధిలో పంటలకు సాగునీరు అందించే గూటాల పంప్ హౌస్ కాలువ గట్టు అక్రమణలకు గురవుతుండటంపై రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంటల సాగు సమయంలో రైతులు కాలినడకన, సైకిళ్లపై, మోటార్ సైకిళ్లపై రాత్రింబవళ్లు కాలువ గట్టు మార్గంలోనే పొలాలకు వెళ్లి నీటి పారుదల పనులు నిర్వహిస్తుంటారు. పంట కోత అనంతరం ట్రాక్టర్ల ద్వారా దిగుబడిని గ్రామాలకు తరలించేందుకు కూడా ఇదే మార్గాన్ని వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఇటీవల తాళ్లపూడి సమీపంలోని కాలువ గట్టు ప్రాంతాల్లో ఆక్రమణలు పెరుగుతున్నాయని, కొందరు వ్యక్తులు కాలువకు ఇరువైపులా గేట్లు, కంచెలు ఏర్పాటు చేసి రైతుల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిస్తున్నారని రైతాంగం ఆవేదన వ్యక్తం చేసింది. కొన్ని ప్రాంతాల్లో రైతులు వెళ్లేందుకు దారి కూడా లేకుండా పరిస్థితి మారిందని వాపోయారు. కాలువ గట్లు క్రమంగా కబ్జాలకు గురవుతున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. వ్యవసాయ పనుల కోసం కీలకమైన ఈ మార్గాలను పరిరక్షించేందుకు అధికారులు తక్షణమే స్పందించి ఆక్రమణలను తొలగించి రైతులకు న్యాయం చేయాలని పలువురు రైతులు విజ్ఞప్తి చేశారు.

తాళ్లపూడి, మే 16 (పున్నమి ప్రతినిధి): తూర్పు గోదావరి జిల్లా తాళ్లపూడి మండల పరిధిలో పంటలకు సాగునీరు అందించే గూటాల పంప్ హౌస్ కాలువ గట్టు అక్రమణలకు గురవుతుండటంపై రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంటల సాగు సమయంలో రైతులు కాలినడకన, సైకిళ్లపై, మోటార్ సైకిళ్లపై రాత్రింబవళ్లు కాలువ గట్టు మార్గంలోనే పొలాలకు వెళ్లి నీటి పారుదల పనులు నిర్వహిస్తుంటారు. పంట కోత అనంతరం ట్రాక్టర్ల ద్వారా దిగుబడిని గ్రామాలకు తరలించేందుకు కూడా ఇదే మార్గాన్ని వినియోగిస్తున్నట్లు తెలిపారు.
ఇటీవల తాళ్లపూడి సమీపంలోని కాలువ గట్టు ప్రాంతాల్లో ఆక్రమణలు పెరుగుతున్నాయని, కొందరు వ్యక్తులు కాలువకు ఇరువైపులా గేట్లు, కంచెలు ఏర్పాటు చేసి రైతుల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిస్తున్నారని రైతాంగం ఆవేదన వ్యక్తం చేసింది. కొన్ని ప్రాంతాల్లో రైతులు వెళ్లేందుకు దారి కూడా లేకుండా పరిస్థితి మారిందని వాపోయారు.
కాలువ గట్లు క్రమంగా కబ్జాలకు గురవుతున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. వ్యవసాయ పనుల కోసం కీలకమైన ఈ మార్గాలను పరిరక్షించేందుకు అధికారులు తక్షణమే స్పందించి ఆక్రమణలను తొలగించి రైతులకు న్యాయం చేయాలని పలువురు రైతులు విజ్ఞప్తి చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.