రాజన్న సిరిసిల్ల జూలై 28 (పున్నమి ప్రతినిధి)
ముస్తాబాద్ మండల కేంద్రంలో ముదిరాజ్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పోతుగల్ గ్రామానికి చెందిన జిల్లెల్ల వెంకటేష్ కిడ్నీ సమస్యతో ఇటీవల మృతి చెందగా, ఆయన భార్య గతంలో క్యాన్సర్‌తో మృతి చెందడంతో తల్లిదండ్రులను కోల్పోయిన ముగ్గురు ఆడపిల్లలు శ్రీవాణి, రమ్య, సామ్యలకు రూ.5,000 ఆర్థిక సాయం అందజేశారు.
ఈ సందర్భంగా ముదిరాజ్ సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు పిట్ల విట్టల్, ప్రధాన కార్యదర్శి జెల శ్రీకాంత్, ఉపాధ్యక్షుడు విద్యాధర్, సహాయ కార్యదర్శి గీస బిక్షపతి మాట్లాడుతూ.. చిన్నారులకు ఎలాంటి ఆస్తిపాస్తులు, తల్లిదండ్రుల ఇన్సూరెన్స్ సదుపాయం లేదని, ప్రభుత్వం ప్రత్యేకంగా ఆదుకుని వారి చదువుకు సహకరించడంతో పాటు భవిష్యత్తులో ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. అలాగే కులబాంధవులు కూడా చిన్నారులకు అండగా నిలిచి ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో సహాయ కార్యదర్శి చికోడు నర్సింలు, బోయిని గంగాధర్, ఆవునూరు పిట్ల రాజు, పోతుగల్ గ్రామ పెద్ద గీస శంకర్, ముస్తాబాద్ గ్రామ పెద్ద రాములు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


