డీఎస్సీ నియామక ప్రక్రియలో అవినీతి, అక్రమాలు జరిగాయంటూ ఇటీవల రైల్వేకోడూరులో నిర్వహించిన నిరసన ర్యాలీకి సంబంధించి రాయలసీమ జోన్ బూత్ కమిటీ అధ్యక్షుడు తల్లెం భరత్‌కుమార్‌రెడ్డికి పోలీసులు సోమవారం ఉదయం నోటీసులు జారీ చేశారు.డీఎస్సీ ప్రక్రియలో పారదర్శకత లోపించిందని, అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ నిర్వహించిన నిరసన ర్యాలీలో భరత్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. అభ్యర్థులకు న్యాయం చేయాలని, అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.తనకు పోలీసులు నోటీసులు ఇవ్వడంపై భరత్‌కుమార్‌రెడ్డి స్పందిస్తూ.. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపినందుకే నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. నోటీసులకు భయపడేది లేదని, డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ఈ ఘటనతో రైల్వేకోడూరు నియోజకవర్గంలో రాజకీయ చర్చకు దారితీసింది.

డీఎస్సీ అవినీతి ఆరోపణలపై నిరసన.. భరత్‌కుమార్‌రెడ్డికి పోలీసు నోటీసులు