Thursday, 24 September 2026
  • Home  
  • డీఎస్సీ అక్రమాలపై నిరసనను అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం
- News

డీఎస్సీ అక్రమాలపై నిరసనను అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం

డీఎస్సీ అక్రమాలపై నిరసనను అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం పోలీసుల నోటీసుపై రెడ్యం వెంకటసుబ్బారెడ్డి ఆగ్రహం ఖాజీపేట ఆగష్టు 11 మైదుకూరులో సోమవారం నిర్వహించనున్న డీఎస్సీ-2025 అక్రమాలు, అవకతవకలపై నిరసన ర్యాలీకి వెళ్లొద్దంటూ ఖాజీపేట పోలీసులు ఆదివారం రాత్రి 9.11 గంటలకు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డికి నోటీసు అందజేశారు. ఖాజీపేట మండలం దుంపలగట్టులోని ఆయన స్వగృహంలో ఈ నోటీసును పోలీసులు అందించారు. డీఎస్సీ-2025లో జరిగిన అక్రమాలు, అవకతవకలపై తక్షణం సీబీఐ విచారణ చేపట్టాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నట్లు రెడ్యం వెంకటసుబ్బారెడ్డి తెలిపారు. నిరసన ర్యాలీని అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం పోలీసుల ద్వారా అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నించడం సరికాదని ఆయన విమర్శించారు. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని, ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. అక్రమాలు, అన్యాయాలపై ఉద్యమించడం, నిరసన తెలియజేయడం ప్రతి పౌరుడి హక్కు అని రెడ్యం పేర్కొన్నారు. ప్రజల హక్కులను అడ్డుకునే అధికారం ప్రభుత్వానికి, పోలీసులకు లేదని అన్నారు.

డీఎస్సీ అక్రమాలపై నిరసనను అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం

పోలీసుల నోటీసుపై రెడ్యం వెంకటసుబ్బారెడ్డి ఆగ్రహం

ఖాజీపేట ఆగష్టు 11

మైదుకూరులో సోమవారం నిర్వహించనున్న డీఎస్సీ-2025 అక్రమాలు, అవకతవకలపై నిరసన ర్యాలీకి వెళ్లొద్దంటూ ఖాజీపేట పోలీసులు ఆదివారం రాత్రి 9.11 గంటలకు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డికి నోటీసు అందజేశారు. ఖాజీపేట మండలం దుంపలగట్టులోని ఆయన స్వగృహంలో ఈ నోటీసును పోలీసులు అందించారు.

డీఎస్సీ-2025లో జరిగిన అక్రమాలు, అవకతవకలపై తక్షణం సీబీఐ విచారణ చేపట్టాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నట్లు రెడ్యం వెంకటసుబ్బారెడ్డి తెలిపారు.

నిరసన ర్యాలీని అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం పోలీసుల ద్వారా అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నించడం సరికాదని ఆయన విమర్శించారు. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని, ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.

అక్రమాలు, అన్యాయాలపై ఉద్యమించడం, నిరసన తెలియజేయడం ప్రతి పౌరుడి హక్కు అని రెడ్యం పేర్కొన్నారు. ప్రజల హక్కులను అడ్డుకునే అధికారం ప్రభుత్వానికి, పోలీసులకు లేదని అన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.