Tuesday, 14 July 2026
  • Home  
  • డిప్యూటీ కలెక్టర్ కిరణ్‌కు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ పరిరక్షణ కమిటీ ఘన సన్మానం*
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

డిప్యూటీ కలెక్టర్ కిరణ్‌కు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ పరిరక్షణ కమిటీ ఘన సన్మానం*

*డిప్యూటీ కలెక్టర్ కిరణ్‌కు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ పరిరక్షణ కమిటీ ఘన సన్మానం* *నెల్లూరు, జూలై 14:* బలహీన వర్గాల సంక్షేమానికి చేసిన సేవలకు గుర్తింపుగా నెల్లూరు జిల్లా మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్, డిప్యూటీ కలెక్టర్ శ్రీ కిరణ్‌ను ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ పరిరక్షణ కమిటీ నేతలు ఘనంగా సన్మానించారు. నెల్లూరులోని ఆయన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో కమిటీ నేతలు శాలువా, షీల్డ్ అందజేసిన కమిటీ జిల్లా మహిళా నేతలు యన్. జయశ్రీ, నెల్లూరు నగర అధ్యక్షురాలు సిహెచ్ నాగమణి, కమిటీ అడ్వైజర్ వి.వెంకటేశ్వర్లు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కమిటీ రాష్ట్ర అధ్యక్షులు, జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మాజీ సభ్యులు కొప్పాల రఘు మాట్లాడారు. గతంలో ఆత్మకూరు, గూడూరు రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్డీవో గా పనిచేసిన సమయంలో శ్రీ కిరణ్ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాల అమలులో, జస్టిస్ కే. పున్నయ్య కమిషన్ సిఫారసుల అమలులో కీలక పాత్ర పోషించారని తెలిపారు. గ్రామస్థాయి పౌర హక్కుల దినోత్సవం, గ్రామసభలను సమర్థంగా నిర్వహించడంతో పాటు పెండింగ్ సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్ కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టారని వారి సేవలను కొనియాడారు. మెప్మా పరిధిలోని పొదుపు సంఘాల సభ్యుల సంక్షేమ పథకాల అమలులో ఆయన చూపిస్తున్న చొరవ, పారదర్శకత అందరికీ ఆదర్శమని రఘు పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా ఆయన చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. సన్మానానికి కృతజ్ఞతలు తెలిపిన మెప్మా పీడీ శ్రీ కిరణ్ మాట్లాడుతూ, ప్రజలందరికీ సమాన న్యాయం అందించడమే తన లక్ష్యమని, అధికారిగా బాధ్యతలను మరింత నిబద్ధతతో నిర్వర్తిస్తానని హామీ ఇచ్చారు.

*డిప్యూటీ కలెక్టర్ కిరణ్‌కు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ పరిరక్షణ కమిటీ ఘన సన్మానం*

*నెల్లూరు, జూలై 14:* బలహీన వర్గాల సంక్షేమానికి చేసిన సేవలకు గుర్తింపుగా నెల్లూరు జిల్లా మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్, డిప్యూటీ కలెక్టర్ శ్రీ కిరణ్‌ను ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ పరిరక్షణ కమిటీ నేతలు ఘనంగా సన్మానించారు.

నెల్లూరులోని ఆయన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో కమిటీ నేతలు శాలువా, షీల్డ్ అందజేసిన కమిటీ జిల్లా మహిళా నేతలు యన్. జయశ్రీ, నెల్లూరు నగర అధ్యక్షురాలు సిహెచ్ నాగమణి, కమిటీ అడ్వైజర్ వి.వెంకటేశ్వర్లు అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా కమిటీ రాష్ట్ర అధ్యక్షులు, జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మాజీ సభ్యులు కొప్పాల రఘు మాట్లాడారు. గతంలో ఆత్మకూరు, గూడూరు రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్డీవో గా పనిచేసిన సమయంలో శ్రీ కిరణ్ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాల అమలులో, జస్టిస్ కే. పున్నయ్య కమిషన్ సిఫారసుల అమలులో కీలక పాత్ర పోషించారని తెలిపారు.

గ్రామస్థాయి పౌర హక్కుల దినోత్సవం, గ్రామసభలను సమర్థంగా నిర్వహించడంతో పాటు పెండింగ్ సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్ కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టారని వారి సేవలను కొనియాడారు.

మెప్మా పరిధిలోని పొదుపు సంఘాల సభ్యుల సంక్షేమ పథకాల అమలులో ఆయన చూపిస్తున్న చొరవ, పారదర్శకత అందరికీ ఆదర్శమని రఘు పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా ఆయన చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.

సన్మానానికి కృతజ్ఞతలు తెలిపిన మెప్మా పీడీ శ్రీ కిరణ్ మాట్లాడుతూ, ప్రజలందరికీ సమాన న్యాయం అందించడమే తన లక్ష్యమని, అధికారిగా బాధ్యతలను మరింత నిబద్ధతతో నిర్వర్తిస్తానని హామీ ఇచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.