*డా.వెన్నెల గద్దర్ ను మర్యాద కలిసి సత్కరించిన*
మమత స్వచ్చంద సేవాసమితి వ్యవస్థాపక అద్యక్షులు కోరుకొండ జాన్
పి గన్నవరం నుండి ఆగస్టు 15 పున్నమి ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నుండి మమతా స్వచ్ఛంద సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు డా. కోరుకొండ జాన్. వారి కుమారుడు కోరుకొండ నవీన్. తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ రథసారథి ప్రజా గాయకుడు ప్రజా యుద్ధనౌక గద్దర్ గారి కుమార్తె డాక్టర్ వెన్నెల గద్దర్ ని ఆగస్టు 15వ తేదీ శనివారం ఉదయం 10 గంటలకు. తెలంగాణ ప్రభుత్వము భాషా సాంస్కృతిక ప్రధాన కార్యాలయము నందు మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు ఈ సందర్భంగా వెన్నెల గద్దర్ మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మమత స్వచ్ఛంద సేవా సమితి ద్వారా గద్దర్ పేరుతో చేయుచున్న సేవా కార్యక్రమాలను చూసి సంతోషించి అభినందించారు రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేద్దామని తెలిపారు.నాన్న గద్దర్ పేరుతో ఆంధ్ర తెలంగాణ అన్ని జిల్లాల్లోనూ ఒక ప్రణాళికను సిద్ధం చేసి సేవా కార్యక్రమాలను విస్తరింప చేద్దామని తెలియజేశారు.ఈ సందర్భంగా వెన్నెల గద్దర్ కు మమత స్వచ్ఛంద సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కోరుకొండ జాన్. చేతి గడియారమును బహుకరించారు.

