ప్రజా వైద్యుడిగా, మాజీ మున్సిపల్ ఛైర్మన్గా విశిష్ట సేవలు అందించిన డా. నీలయ్య గారి ప్రభాకర్ నాయుడు గారి 89వ జన్మదినోత్సవం సందర్భంగా మద్దూరుపాడు మాజీ సర్పంచ్ రావులకొల్లు బాలకృష్ణ (RBK), లోక్ అదాలత్ సభ్యులు ముడిగండ్ల మాలకొండ రెడ్డి కలిసి ఘనంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, డా. ప్రభాకర్ నాయుడు ప్రజా వైద్యుడిగా లక్షలాది మందికి శస్త్రచికిత్సలు నిర్వహించి, నిరుపేదలకు ఉచిత వైద్య సేవలు అందిస్తూ వైద్య వృత్తికి విశిష్టమైన గౌరవాన్ని తీసుకువచ్చారని కొనియాడారు. ప్రజాసేవను జీవిత లక్ష్యంగా చేసుకుని అనేక మంది జీవితాల్లో వెలుగులు నింపిన ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలతో మరెన్నో సంవత్సరాలు ప్రజలకు సేవలందించాలని ఆకాంక్షించారు.


