డా. అజిత వేజెండ్ల ఆధ్వర్యంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక.. 158 వినతుల స్వీకరణ
SPSR నెల్లూరు జిల్లా, తేది: 11.05.2026:
జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో మొత్తం 158 ఫిర్యాదులు స్వీకరించారు. మోసాలు, కుటుంబ వివాదాలు, దొంగతనాలు తదితర అంశాలకు సంబంధించిన వినతులను బాధితులు ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు. ప్రతి ఫిర్యాదును చట్టపరంగా సమగ్రంగా విచారించి బాధితులకు త్వరితగతిన న్యాయం అందించాలని సంబంధిత అధికారులకు ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. ప్రజల సమస్యలను సానుభూతితో విని, పారదర్శకంగా పరిష్కరించేందుకు పోలీసు శాఖ కట్టుబడి ఉందని ఎస్పీ తెలిపారు.



