శ్రీకాళహస్తి, మే 18, (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తిలో నూతన పోలీస్ స్టేషన్ భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పదో తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థిని కె. నివేదితకు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి నగదు బహుమతి అందజేశారు. పోలీస్ శాఖలో పనిచేస్తున్న కె. మధుబాబు కుమార్తె అయిన నివేదిత, మార్చి-2026 పదో తరగతి పరీక్షల్లో 600 మార్కులకు గాను 586 మార్కులు సాధించి ప్రతిభ చాటుకుంది. ఈ సందర్భంగా మంత్రులు ఆమెను అభినందిస్తూ ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. విద్యార్థినిని సత్కరించి ప్రోత్సహించిన మంత్రులు, ఎమ్మెల్యేకు ఎంజీఎం స్కూల్ డైరెక్టర్ డాక్టర్ గుడ్లూరు మయూర్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు.

టెన్త్ టాపర్ నివేదితకు మంత్రుల చేతుల మీదుగా నగదు బహుమతి