నంద్యాల: పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్, జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అన్నారు.‘సేవా మేరా యోగ్దాన్’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నంద్యాల ఎస్.ఆర్.బి.సి. కాలనీలోని టిడ్కో గృహాల ప్రాంగణంలో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో మంత్రి ఫరూక్, కలెక్టర్ రాజకుమారి పాల్గొని మొక్కలు నాటారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పచ్చదనం పెంపొందించడంతో పాటు నాటిన మొక్కలను సంరక్షించడంపై ప్రజలు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. కాలనీ పరిసరాలను పచ్చదనంతో తీర్చిదిద్దేందుకు అధికారులు, ప్రజలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.కార్యక్రమంలో ట్రైనీ సబ్ కలెక్టర్ ప్రియాంక, ఆర్డీఓ విశ్వనాథ్, తహశీల్దార్లు శ్రీనివాసులు, శ్రీవాణి, మున్సిపల్ కమిషనర్ బి. శేషన్న, ఎమ్ ఈ నాగభూషణం రెడ్డి. డీఈలు. రెవెన్యూ ఇన్స్పెక్టర్లు విక్రమ్. అధికారులు, ప్రజాప్రతినిధులు, టిడ్కో అధికారులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.

టిడ్కో గృహాల వద్ద మొక్కలు నాటిన మంత్రి, కలెక్టర్