ఈ నెల 19వ తేదీ (ఆదివారం) సందర్భంగా హైదరాబాద్ గౌలిపుర వాస్తవ్యులు, నల్ల పోచమ్మ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బోనాల మహోత్సవంలో, బోనాన్ని మన ఆలంపూర్ శ్రీ జోగులాంబ అమ్మవారికి (అష్టాదశ శక్తిపీఠాలలో ఐదవ శక్తిపీఠం) సమర్పించనున్నారు.
ఈ మహోత్సవంలో సుమారు:
– 200 మంది కళాకారులు డప్పు వాయిద్యాలతో,
– 500 మంది మహిళలు బోనాలతో,
– మొత్తం 1,000 మందికి పైగా భక్తులు ఆలంపూర్ పట్టణానికి విచ్చేసి అమ్మవారికి బోనం సమర్పించనున్నారు.
ప్రత్యేక ఆహ్వానితులు:
– శ్రీ బీర్లు ఐలయ్య గారు – ప్రభుత్వ విప్
– శ్రీ సంపత్ కుమార్ గారు – మాజీ ఎమ్మెల్యే, ఆలంపూర్
– శ్రీ జల్లాపురం వెంకటేశ్వర్లు గారు – మాజీ చైర్మన్, శ్రీ జోగులాంబ దేవాలయం
ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ కురుమ సంఘం వారు ఘనంగా నిర్వహిస్తున్నారు.
కాబట్టి జోగులాంబ గద్వాల జిల్లా మరియు పరిసర ప్రాంతాల భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని, శ్రీ జోగులాంబ అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా మనవి.
జై జోగులాంబ తల్లి! 🙏


