Sunday, 13 September 2026
  • Home  
  • జాగ్రత్తలు పాటిస్తూ వినాయక చవితి నిర్వహించుకోండి: సీఐ గంగాధర్
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

జాగ్రత్తలు పాటిస్తూ వినాయక చవితి నిర్వహించుకోండి: సీఐ గంగాధర్

అనంతసాగరం సెప్టెంబర్ 12,పున్నమి ప్రతినిధి : వినాయక చవితి పండుగను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని ఆత్మకూరు పోలీస్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ జి. గంగాధర్ ప్రజలకు సూచించారు. ఆత్మకూరు పోలీస్ సర్కిల్ పరిధిలోని ప్రజలకు ఆయన ముందస్తుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఆత్మకూరు పోలీస్ సర్కిల్ పరిధిలోని అన్ని మండలాలు, గ్రామాల్లో వినాయక విగ్రహాల ఏర్పాటుకు సంబంధించి ప్రజలు పలు జాగ్రత్తలు పాటించాలని సీఐ సూచించారు. విగ్రహాలను ఏర్పాటు చేసుకునే ముందు తప్పనిసరిగా సంబంధిత అధికారుల నుంచి అనుమతులు పొందాలని తెలిపారు. వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసే ప్రాంగణం వల్ల స్థానిక ప్రజలకు, వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని సూచించారు. విగ్రహాల ఏర్పాటు సమయంలో విద్యుత్ శాఖ, అగ్నిమాపక శాఖ అధికారులు సూచించే భద్రతా చర్యలను తప్పనిసరిగా పాటించాలన్నారు. విగ్రహాలు ఏర్పాటు చేసిన మండపాల వద్ద విగ్రహం తరలించే వరకు బాధ్యులు లేదా నిర్వాహకుల్లో ఎవరైనా తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని తెలిపారు. మండపాల వద్ద, అలాగే విగ్రహాల నిమజ్జనానికి తరలించే సమయంలో డీజేలు ఏర్పాటు చేయరాదని స్పష్టం చేశారు. మండపాల వద్ద లేదా విగ్రహాల తరలింపు సమయంలో ఎలాంటి గొడవలకు, వివాదాలకు పాల్పడకుండా ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలని సీఐ గంగాధర్ కోరారు. భక్తిపారవశ్యంతో, ప్రశాంత వాతావరణంలో అందరూ కలిసి సంతోషంగా వినాయక చవితి పండుగను నిర్వహించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

అనంతసాగరం సెప్టెంబర్ 12,పున్నమి ప్రతినిధి : వినాయక చవితి పండుగను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని ఆత్మకూరు పోలీస్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ జి. గంగాధర్ ప్రజలకు సూచించారు. ఆత్మకూరు పోలీస్ సర్కిల్ పరిధిలోని ప్రజలకు ఆయన ముందస్తుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.
ఆత్మకూరు పోలీస్ సర్కిల్ పరిధిలోని అన్ని మండలాలు, గ్రామాల్లో వినాయక విగ్రహాల ఏర్పాటుకు సంబంధించి ప్రజలు పలు జాగ్రత్తలు పాటించాలని సీఐ సూచించారు. విగ్రహాలను ఏర్పాటు చేసుకునే ముందు తప్పనిసరిగా సంబంధిత అధికారుల నుంచి అనుమతులు పొందాలని తెలిపారు.
వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసే ప్రాంగణం వల్ల స్థానిక ప్రజలకు, వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని సూచించారు. విగ్రహాల ఏర్పాటు సమయంలో విద్యుత్ శాఖ, అగ్నిమాపక శాఖ అధికారులు సూచించే భద్రతా చర్యలను తప్పనిసరిగా పాటించాలన్నారు.
విగ్రహాలు ఏర్పాటు చేసిన మండపాల వద్ద విగ్రహం తరలించే వరకు బాధ్యులు లేదా నిర్వాహకుల్లో ఎవరైనా తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని తెలిపారు. మండపాల వద్ద, అలాగే విగ్రహాల నిమజ్జనానికి తరలించే సమయంలో డీజేలు ఏర్పాటు చేయరాదని స్పష్టం చేశారు.
మండపాల వద్ద లేదా విగ్రహాల తరలింపు సమయంలో ఎలాంటి గొడవలకు, వివాదాలకు పాల్పడకుండా ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలని సీఐ గంగాధర్ కోరారు. భక్తిపారవశ్యంతో, ప్రశాంత వాతావరణంలో అందరూ కలిసి సంతోషంగా వినాయక చవితి పండుగను నిర్వహించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.