కావలి మాజీ శాసనసభ్యుడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత వంటేరు వేణుగోపాల్ రెడ్డి తన సొంత మండలంలో నందమూరి తారక రామారావు విగ్రహం ఏర్పాటుకు శ్రీకారం చుట్టనున్నారు. రాజకీయ సామాజిక విప్లవం తీసుకొచ్చి పేద ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందించిన ఆయన విగ్రహం జలదంకిలో లేకపోవడం పట్ల వంటేరు గత కొద్ది కాలంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం నాడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా జలదంకి మహానాడులో పాల్గొన్న ఆయన తన సన్నిహితులతో జలదంకిలోని గట్టుపల్లి బైపాస్ సర్కిల్ లో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేసే విషయం పై చర్చించారు. అదేవిధంగా సర్కిల్లో స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని ఉద్యమానికి ఎన్నో త్యాగాలు చేసిన జలదంకి మండల వాసుల విగ్రహాలు కూడా ఆ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసి వారి త్యాగాలను భవిష్యత్ తరాలకు అందించాలని భావిస్తున్నట్లు సమాచారం ఆయన తండ్రి బ్రాహ్మణ కాక సుదీర్ఘకాల ఏకగ్రీవ సర్పంచి వరదారెడ్డి తోపాటు వేల మంది విద్యార్థులకు విద్య ,ఆహారపు వసతి కల్పించిన తిప్పారెడ్డి రామిరెడ్డి, ఎలమందారెడ్డి,సురే ఈశ్వర్ రెడ్డి మరికొందరు స్వతంత్ర సమరయోధుల విగ్రహాలను సర్కిల్లో ఏర్పాటు చేసి జలదంకి మండల కేంద్రంలో ఆకట్టుకునే విధంగా చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది .ఈ మేరకు ఉదయగిరి ఎమ్మెల్యే తదితర సీనియర్ నేతలతో తో చర్చించి ఈ ప్రతిపాదనకు త్వరలో చర్యలు చేపట్టనున్నట్లు సమాచారం. కావలి పట్టణంలో కూడా ఎన్నో ఏళ్లుగా ఎన్టీఆర్ విగ్రహం లేని కొరతను వంటేరు తీర్చడంలో ముందుకు వచ్చారు. స్థానిక తాసిల్దార్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎన్టీఆర్ తన సొంత నిధులతో ఏర్పాటు చేయగా ఆ తర్వాత రాజకీయ పరిణామాలలో ఆయన పార్టీకి దూరం కావడంతో మిగిలిన పనులను అప్పటి ఎమ్మెల్యే బీద మస్తాన్ రావు పూర్తి చేశారు . బైపాస్ సర్కిల్లో ఎన్టీఆర్ విగ్రహాలతో పాటు మండలానికి చెందిన స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలను ఏర్పాటు చేయాలన్న ఆలోచనపై రాజకీయాలకతీతంగా మండల వాసులందరూ హర్ష వ్యక్తం చేస్తున్నారు దీనికి సంబంధించి పలువురు సన్నిహితులతో సమావేశం ఏర్పాటు చేసి చర్యలు చేపట్లనున్నట్లు తెలిసింది.అయితే కమ్మ పాలెం కు చెందిన గొట్టిపాటి కొండప నాయుడు తనకు విద్యార్ధి దశలో ఆహార, వసతి సౌకర్యాలు కల్పించిన తిప్పారెడ్డి సోదరుల విగ్రాహాలు జలదంకి లో ఏర్పాటు చేసి తన కృతజ్ఞత చెల్లించాలని భావిస్తున్నారు.

జలదంకి లో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటులో వంటేరు