ఘనంగా తూర్పుగోదావరి జిల్లా మహాసభ – సీనియర్ జర్నలిస్టులకు సన్మానం
రాజమహేంద్రవరం, సెప్టెంబరు 6 (పున్నమి ప్రతినిధి):
జర్నలిస్టులకు భరోసా కల్పించేందుకు జేడీఆర్ఎఫ్ను ఏర్పాటు చేసినట్లు ఆ సంస్థ రాష్ట్ర కార్యదర్శి, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం రాజమండ్రి పోలీస్ కన్వెన్షన్ హాల్లో జేడీఆర్ఎఫ్ తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మహాసభ ఘనంగా నిర్వహించారు.
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి
మేడా శ్రీనివాస్ మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లాలో జేడీఆర్ఎఫ్ బలోపేతానికి జిల్లా గౌరవ అధ్యక్షులు మారంపూడి సోమరాజు, దివంగత జేడీఆర్ఎఫ్ కార్యదర్శి, విలేకరి కుడెల్లి రత్న కిషోర్ కృషి చేశారని అన్నారు. రత్న కిషోర్ మృతి తీరని లోటని పేర్కొన్నారు.
జేడీఆర్ఎఫ్ జాతీయ అధ్యక్షులు పూలతోట కృష్ణ సారథ్యంలో జర్నలిస్టుల సమస్యలపై జాతీయస్థాయిలో ఉద్యమాలు చేస్తున్నట్లు తెలిపారు. జేడీఆర్ఎఫ్ ఎల్లప్పుడూ విలేకరులకు అండగా ఉంటుందని, ఏ సమస్య వచ్చినా, కష్టం ఎదురైనా వారి పక్షాన నిలబడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
పెద్దగా సంపాదన లేకపోయినప్పటికీ గౌరవప్రదమైన వృత్తిగా భావించి విలేకరులు పాత్రికేయ వృత్తిలో కొనసాగుతున్నారని అన్నారు. అక్రమాలు, అన్యాయాలపై వార్తలు రాసే విలేకరులపై రాజకీయ నాయకులు, పోలీసులు అక్రమ కేసులు పెట్టి దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. విలేకరులపై అక్రమ కేసులు పెట్టినా, దాడులు జరిగినా జేడీఆర్ఎఫ్ వారికి అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.
సీనియర్ జర్నలిస్టులకు ఘన సన్మానం
ఈ సందర్భంగా జేడీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో 20 సంవత్సరాలకు పైగా పత్రికా రంగంలో కొనసాగుతున్న రాఘవరావు, లింకన్, వరద నాగేశ్వరరావు, రాజగోపాల్, తలుపుల రావు, కృపానందం, మారంపూడి సోమరాజు తదితర సీనియర్ జర్నలిస్టులను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ టీ.కే. విశ్వేశ్వరరెడ్డి, నగర అధ్యక్షులు బాలేపల్లి మురళి, జేడీఆర్ఎఫ్ గౌరవ అధ్యక్షులు మారంపూడి సోమరాజు, జిల్లా అధ్యక్షులు గాదె గిరీష్ కుమార్ గుప్తా, ప్రధాన కార్యదర్శి సింగంశెట్టి సూర్య రాఘవేంద్ర, కోశాధికారి పిచ్చుక మహేష్, ఉపాధ్యక్షులు గొర్రెల రాజు, ఎస్.కే. మదీనా భాష, కార్యదర్శి ఉమ్మెత్తల శ్రీనివాస్, ఉప కార్యదర్శులు కారాసు శివరామకృష్ణ, రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం, ఎగ్జిక్యూటివ్ సభ్యులు కోడి తాతారావు, యండమూరి శ్రీనివాస్, యనగల వెంకటేష్, చల్ల విజయ్ (బాలు), మహమ్మద్ నజీర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.










