Saturday, 3 October 2026
  • Home  
  • జనతా ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దుగ్గొండిలో ఘనంగా ఉచిత మెగా వైద్య శిబిరం మరియు 4వ విడత ఉచిత కంటి వైద్య శిబిరం
- వరంగల్

జనతా ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దుగ్గొండిలో ఘనంగా ఉచిత మెగా వైద్య శిబిరం మరియు 4వ విడత ఉచిత కంటి వైద్య శిబిరం

నర్సంపేట నియోజకవర్గం, దుగ్గొండి మండలం గిర్నిబావిలోని కనిష్క ఫంక్షన్ హాల్ లో ఈరోజు జనతా ట్రస్ట్ చైర్మన్ _డా. గోగుల రాణా ప్రతాప్ రెడ్డి_ గారి ఆధ్వర్యంలో జనతా ట్రస్ట్, బంధన్ హాస్పిటల్స్ మరియు శంకర కంటి ఆసుపత్రి, వారి సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం మరియు 4వ విడత ఉచిత కంటి వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు శ్రీ మార్తినేని ధర్మారావు గారు ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ MLA మార్తినేని ధర్మారావు గారు మాట్లాడుతూ.. సమాజంలో సేవ చేయాలనే దృక్పథంతో ముందుకు వస్తున్న యువకులందరికీ డా. గోగుల రాణా ప్రతాప్ రెడ్డి గారు ఒక ఆదర్శమని, ఆయన చేస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు. రాజకీయాలకు అతీతంగా పేద ప్రజలకు వైద్య సేవలు అందించాలనే గొప్ప సంకల్పంతో జనతా ట్రస్ట్ ద్వారా ఇలాంటి మెగా వైద్య శిబిరాలు నిర్వహించడం చాలా గొప్ప విషయమని అన్నారు. డబ్బు ఉన్నవారికి వైద్యం అందుతుంది కానీ, పేదవాడికి కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ఉచితంగా ఇంటి దగ్గరకే తీసుకురావడం అనేది నిజమైన సేవ అని జనతా ట్రస్ట్ సభ్యులను అభినందించారు. రాణా చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలు నర్సంపేట నర్సంపేట నియోజకవర్గానికే కాకా కాకుండా ఉమ్మడి వరంగల్ జిల్లాకే స్ఫూర్తిదాయకమని తెలిపారు, భవిష్యత్తులో జనతా ట్రస్ట్ మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని, తమ మద్దతు మరియు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ శిబిరంలో శంకర కంటి ఆసుపత్రికి చెందిన నిపుణులైన వైద్యులచే దాదాపు 1178 మంది_ కంటి రోగులకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించారు. అందులో కంటి శస్త్ర చికిత్స అవసరం ఉన్న 93 మందిని ఉచిత సర్జరీలకు ఎంపిక చేయడం జరిగింది వారందరికీ హైదరాబాద్ లోని శంకర కంటి ఆసుపత్రిలో పూర్తి ఉచితంగా ఆపరేషన్లు చేసి, మందులు కూడా ఉచితంగా అందజేస్తామని హాస్పిటల్ యాజమాన్యం తెలిపింది. బంధన్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఈరోజు Trauma, Emergency & Critical Care తరఫున దాదాపు _12 మంది_ స్పెషలిస్ట్ డాక్టర్లు ఈ శిబిరానికి విచ్చేసి దాదాపు _900 మందికి_ పైగా రోగులకు సేవలందించారు. జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పల్మనాలజీ, గైనకాలజీ, డెంటల్, జనరల్ సర్జరీ, పీడియాట్రిక్స్, క్రిటికల్ కేర్ విభాగాలలో ఉచితంగా చెకప్ చేసి, అందరికీ బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అంతేకాకుండా బంధన్ హాస్పిటల్ కు వస్తే తమ ద్వారా అయ్యే అన్ని ఆపరేషన్లకు, చికిత్సలకు ప్రత్యేక రాయితీలు, ఆఫర్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనతా ట్రస్ట్ సభ్యులు, బంధన్, శంకర హాస్పిటల్ వైద్య సిబ్బంది, స్థానిక నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

నర్సంపేట నియోజకవర్గం, దుగ్గొండి మండలం గిర్నిబావిలోని కనిష్క ఫంక్షన్ హాల్ లో ఈరోజు జనతా ట్రస్ట్ చైర్మన్ _డా. గోగుల రాణా ప్రతాప్ రెడ్డి_ గారి ఆధ్వర్యంలో జనతా ట్రస్ట్, బంధన్ హాస్పిటల్స్ మరియు శంకర కంటి ఆసుపత్రి, వారి సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం మరియు 4వ విడత ఉచిత కంటి వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు శ్రీ మార్తినేని ధర్మారావు గారు ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి శిబిరాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాజీ MLA మార్తినేని ధర్మారావు గారు మాట్లాడుతూ..
సమాజంలో సేవ చేయాలనే దృక్పథంతో ముందుకు వస్తున్న యువకులందరికీ డా. గోగుల రాణా ప్రతాప్ రెడ్డి గారు ఒక ఆదర్శమని, ఆయన చేస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు. రాజకీయాలకు అతీతంగా పేద ప్రజలకు వైద్య సేవలు అందించాలనే గొప్ప సంకల్పంతో జనతా ట్రస్ట్ ద్వారా ఇలాంటి మెగా వైద్య శిబిరాలు నిర్వహించడం చాలా గొప్ప విషయమని అన్నారు. డబ్బు ఉన్నవారికి వైద్యం అందుతుంది కానీ, పేదవాడికి కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ఉచితంగా ఇంటి దగ్గరకే తీసుకురావడం అనేది నిజమైన సేవ అని జనతా ట్రస్ట్ సభ్యులను అభినందించారు. రాణా చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలు నర్సంపేట నర్సంపేట నియోజకవర్గానికే కాకా కాకుండా ఉమ్మడి వరంగల్ జిల్లాకే స్ఫూర్తిదాయకమని తెలిపారు, భవిష్యత్తులో జనతా ట్రస్ట్ మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని, తమ మద్దతు మరియు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు.
ఈ శిబిరంలో శంకర కంటి ఆసుపత్రికి చెందిన నిపుణులైన వైద్యులచే దాదాపు 1178 మంది_ కంటి రోగులకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించారు. అందులో కంటి శస్త్ర చికిత్స అవసరం ఉన్న 93 మందిని ఉచిత సర్జరీలకు ఎంపిక చేయడం జరిగింది వారందరికీ హైదరాబాద్ లోని శంకర కంటి ఆసుపత్రిలో పూర్తి ఉచితంగా ఆపరేషన్లు చేసి, మందులు కూడా ఉచితంగా అందజేస్తామని హాస్పిటల్ యాజమాన్యం తెలిపింది.
బంధన్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఈరోజు Trauma, Emergency & Critical Care తరఫున దాదాపు _12 మంది_ స్పెషలిస్ట్ డాక్టర్లు ఈ శిబిరానికి విచ్చేసి దాదాపు _900 మందికి_ పైగా రోగులకు సేవలందించారు. జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పల్మనాలజీ, గైనకాలజీ, డెంటల్, జనరల్ సర్జరీ, పీడియాట్రిక్స్, క్రిటికల్ కేర్ విభాగాలలో ఉచితంగా చెకప్ చేసి, అందరికీ బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అంతేకాకుండా బంధన్ హాస్పిటల్ కు వస్తే తమ ద్వారా అయ్యే అన్ని ఆపరేషన్లకు, చికిత్సలకు ప్రత్యేక రాయితీలు, ఆఫర్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జనతా ట్రస్ట్ సభ్యులు, బంధన్, శంకర హాస్పిటల్ వైద్య సిబ్బంది, స్థానిక నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.