కాకినాడ , జగ్గంపేట, పున్నమి ప్రతినిధి,సెప్టెంబర్ 14:
జగ్గంపేట రావులమ్మ నగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజా దర్బార్ ను జగ్గంపేట శాసనసభ్యులు, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు, తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు జ్యోతుల నెహ్రూ నిర్వహించారు. ప్రజల నుండి వినతి పత్రాలను స్వీకరించారు.ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో సంక్షేమ పాలన కొనసాగుతోందని అన్నారు. ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందాలనేదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.పెన్షన్ల విషయంలో గతంలో ఎన్నడూ లేని విధంగా నాలుగు వేల రూపాయల పెన్షన్ ను మొదటి తేదీనే ఇంటి వద్దకే అందిస్తున్నామని, పెన్షన్ కోసం ఎవరూ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుందని అర్హులైన ప్రతి ఒక్కరు సచివాలయంలో నమోదు చేయించుకోవాలని అన్నారు. ఇళ్ల స్థలాలు, హౌసింగ్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి పెట్టామని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు, ఇళ్ల స్థలాలు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.ప్రజా దర్బార్ లో వచ్చిన ప్రతి వినతిని పరిశీలించి వెంటనే పరిష్కరించేలా అధికారులకు ఆదేశాలు ఇచ్చామని, ప్రజా సమస్యల పరిష్కారమే తమ ప్రధాన ధ్యేయమని జ్యోతుల నెహ్రూ స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షులు జీనుమణి బాబు, మాజీ వైస్ ఎంపీపీ మారిశెట్టి భద్రం, రాష్ట్ర ఆర్యవైశ్య డైరెక్టర్ కొత్త కొండబాబు, జగ్గంపేట టౌన్ టిడిపి అధ్యక్షులు పాండ్రంగి రాంబాబు, జిల్లావక్ఫ్ బోర్డ్ మాజీ చైర్మన్ ఎస్ ఏ గపూర్, గోకవరం టౌన్ టిడిపి అధ్యక్షులు పైలా శ్రీనివాస రావు, టౌన్ టిడిపి సెక్రెటరీ కోడూరి రమేష్ అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

జగ్గంపేటలో ప్రజాదర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ
కాకినాడ , జగ్గంపేట, పున్నమి ప్రతినిధి,సెప్టెంబర్ 14: జగ్గంపేట రావులమ్మ నగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజా దర్బార్ ను జగ్గంపేట శాసనసభ్యులు, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు, తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు జ్యోతుల నెహ్రూ నిర్వహించారు. ప్రజల నుండి వినతి పత్రాలను స్వీకరించారు.ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో సంక్షేమ పాలన కొనసాగుతోందని అన్నారు. ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందాలనేదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.పెన్షన్ల విషయంలో గతంలో ఎన్నడూ లేని విధంగా నాలుగు వేల రూపాయల పెన్షన్ ను మొదటి తేదీనే ఇంటి వద్దకే అందిస్తున్నామని, పెన్షన్ కోసం ఎవరూ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుందని అర్హులైన ప్రతి ఒక్కరు సచివాలయంలో నమోదు చేయించుకోవాలని అన్నారు. ఇళ్ల స్థలాలు, హౌసింగ్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి పెట్టామని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు, ఇళ్ల స్థలాలు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.ప్రజా దర్బార్ లో వచ్చిన ప్రతి వినతిని పరిశీలించి వెంటనే పరిష్కరించేలా అధికారులకు ఆదేశాలు ఇచ్చామని, ప్రజా సమస్యల పరిష్కారమే తమ ప్రధాన ధ్యేయమని జ్యోతుల నెహ్రూ స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షులు జీనుమణి బాబు, మాజీ వైస్ ఎంపీపీ మారిశెట్టి భద్రం, రాష్ట్ర ఆర్యవైశ్య డైరెక్టర్ కొత్త కొండబాబు, జగ్గంపేట టౌన్ టిడిపి అధ్యక్షులు పాండ్రంగి రాంబాబు, జిల్లావక్ఫ్ బోర్డ్ మాజీ చైర్మన్ ఎస్ ఏ గపూర్, గోకవరం టౌన్ టిడిపి అధ్యక్షులు పైలా శ్రీనివాస రావు, టౌన్ టిడిపి సెక్రెటరీ కోడూరి రమేష్ అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

