చేపల వేటకు వెళ్లి వలసొచ్చిన ఒక వ్యక్తి చెరువులో పడి గల్లంతైన ఘటన నెల్లూరు జిల్లా దగదర్తి మండల పరిధిలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బుచ్చిరెడ్డిపాలెం మండలం ముళ్లపూడి గ్రామానికి చెందిన మొరు రాజు (60) బతుకుదెరువు కోసం దగదర్తి మండలం తిరువీధిపాడు గ్రామానికి వచ్చాడు. అక్కడ ఒక గుడారం వేసుకుని చేపల వేట సాగిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం కనిగిరి రిజర్వాయర్ చెరువులో చేపలు పట్టేందుకు నీటిలోకి దిగాడు. ప్రమాదవశాత్తు చెరువులో మునిగిపోయి అదృశ్యమయ్యాడు.
సమాచారం అందుకున్న దగదర్తి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. శనివారం నుంచి వెతుకుతున్నప్పటికీ ఇప్పటి వరకు ఆయన ఆచూకీ లభించలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చేపల వేటకు వెళ్లి వలస మత్స్యకారుడు గల్లంతు
చేపల వేటకు వెళ్లి వలసొచ్చిన ఒక వ్యక్తి చెరువులో పడి గల్లంతైన ఘటన నెల్లూరు జిల్లా దగదర్తి మండల పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బుచ్చిరెడ్డిపాలెం మండలం ముళ్లపూడి గ్రామానికి చెందిన మొరు రాజు (60) బతుకుదెరువు కోసం దగదర్తి మండలం తిరువీధిపాడు గ్రామానికి వచ్చాడు. అక్కడ ఒక గుడారం వేసుకుని చేపల వేట సాగిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం కనిగిరి రిజర్వాయర్ చెరువులో చేపలు పట్టేందుకు నీటిలోకి దిగాడు. ప్రమాదవశాత్తు చెరువులో మునిగిపోయి అదృశ్యమయ్యాడు. సమాచారం అందుకున్న దగదర్తి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. శనివారం నుంచి వెతుకుతున్నప్పటికీ ఇప్పటి వరకు ఆయన ఆచూకీ లభించలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

