Sunday, 23 August 2026
  • Home  
  • చిన్నారులతో అనుచిత ప్రవర్తన.. నిందితుడికి రిమాండ్
- తిరుపతి

చిన్నారులతో అనుచిత ప్రవర్తన.. నిందితుడికి రిమాండ్

చిట్వేలు: మండలంలోని గట్టుమీదపల్లి గ్రామానికి చెందిన పలువురు చిన్నారులతో అనుచితంగా ప్రవర్తించిన కేసులో నాగిశెట్టి వెంకట సుబ్బయ్యకు న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. రేణిగుంట డీఎస్పీ ఆధ్వర్యంలో, కోడూరు రూరల్ సీఐ సూచనల మేరకు చిట్వేలు ఎస్‌ఐ దర్యాప్తు చేపట్టారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి చిన్నారులను విచారించగా.. చాక్లెట్లు ఇస్తానని ఆశ చూపి వారిని తన ఇంటి సమీపానికి పిలిచి అనుచితంగా ప్రవర్తించినట్లు వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. సంబంధిత సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసి, కేసుకు సంబంధించిన ఆధారాలను సేకరించారు. అనంతరం నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించింది. చిన్నారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, ఎలాంటి అనుచిత ప్రవర్తన జరిగినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు సూచించారు. కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.