చిత్తూరు జిల్లా , వి కోట ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డిని అత్యంత దారుణంగా హత్య గావించడం అమానుషమని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడు సోమా వెంకట సుబ్బయ్య పేర్కొన్నారు. ఎర్ర చందనం గురించి వార్త రాసినందుకు జర్నలిస్టును హతమార్చడం అత్యంత దారుణం, ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు అని, వెంటనే దోషులను గుర్తించి అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. వాస్తవాలను వెలికితీయడం, వార్తలు రాయడం జర్నలిస్టు విధుల్లో భాగమని,ఏదేని తప్పిదాలుంటే ఇతర మార్గాల అనుసరించాలే తప్ప భౌతిక దాడులు, హత్యలు చేయడం అత్యంత దుర్మార్గమని, ప్రభుత్వం వెంటనే స్పందించి నిందితులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని, మళ్లీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని వెంకటసుబ్బయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి హత్య అత్యంత దిగ్భ్రాంతికరమన్నారు. ఆయన మృతికి ఘన నివాళులర్పిస్తున్నానని, కుటుంబ సభ్యులకు సానుభూతి తెలుపుతున్నానని వెంకటసుబ్బయ్య పేర్కొన్నారు.

చిత్తూరుజిల్లాలో జర్నలిస్టు హత్య దారుణం _ దోషులను వెంటనే అరెస్ట్ చేయాలి