తిరుపతి జిల్లా చిట్వేల్ మండలం తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ఉదయం 11.20 గంటలు దాటినా ఎంఆర్ఓ కార్యాలయానికి రాకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం 10 గంటల నుంచే ఫిర్యాదుల కోసం వచ్చిన రైతులు గంటల తరబడి ఎదురుచూసినా సిబ్బంది స్పందించలేదని మండిపడ్డారు. ప్రతిరోజూ ఇదే పరిస్థితి కొనసాగుతోందని, ప్రజల సమస్యలను పట్టించుకునే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. “ఇది మా రాజ్యం.. మేము చెప్పిందే శాసనం అన్నట్టుగా అధికారులు వ్యవహరిస్తున్నారు” అంటూ రైతులు విమర్శించారు. ప్రజాసేవ కోసం ఉన్న కార్యాలయాలు ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం దారుణమని అన్నారు.

చిట్వేల్ మండలం తహసీల్దార్ కార్యాలయంలో రైతుల ఆగ్రహం