కాకినాడ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్ 28 (పున్నమి న్యూస్):ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు శాఖ ఆధ్వర్యంలో ప్రముఖ తెలుగు కవి, సామాజిక చైతన్య వేత్త గుర్రం జాషువా జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డా. ఎన్. మణిమాల ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ మరియు అధ్యాపకులు గుర్రం జాషువా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రిన్సిపల్ డా.ఎన్. మణిమాల మాట్లాడుతూ గుర్రం జాషువా తన రచనల ద్వారా సామాజిక అసమానతలు,అంటరానితనం, కుల వివక్ష వంటి సమస్యలపై ప్రజల్లో చైతన్యం కలిగించారని తెలిపారు.సమాజంలో సమానత్వం,మానవత్వం, సామాజిక న్యాయం నెలకొల్పేందుకు ఆయన సాహిత్యం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.కళాశాల వైస్ ప్రిన్సిపల్ ముల్లి.శేఖర్ మాట్లాడుతూ తెలుగు సాహిత్యంలో జాషువా రచనలకు విశిష్ట స్థానం ఉందని, విద్యార్థులు జాషువా జీవిత చరిత్ర, సాహిత్య కృషి సామాజిక దృక్పథాన్ని తెలుసుకోవాలని సూచించారు.తెలుగు అధ్యాపకురాలు కోట్ల.లక్ష్మి ప్రసన్న మాట్లాడుతూ గుర్రం జాషువా సమకాలీన కవిత్వ వరవడి అయిన భావ కవిత్వరీతి నుండి పక్కకు జరిగి సామాజిక ప్రయోజనం ఆశించి రచనలు చేశారని అన్నారు. గుర్రం జాషువా చీత్కారాలు ఎదురైన చోటే సత్కారాలు పొందారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డా.వై.పద్మ, ఎం. రాకేష్ రాజ్, డా. జె.శివకృష్ణ, కె.సత్య గణేష్, డా.జి.ఝాన్సీ, బి. శ్రీనివాసరావు, ఎన్.ఆనంద్, కె. కీర్తి మరియు అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

గుర్రం జాషువా జయంతి ఘనంగా నిర్వహణ