Thursday, 30 July 2026
  • Home  
  • గురు రవిదాస్ ఆశయాలే సమానత్వ సమాజానికి మార్గం: బండ్ల రీగన్ ప్రతాప్
- ఖమ్మం

గురు రవిదాస్ ఆశయాలే సమానత్వ సమాజానికి మార్గం: బండ్ల రీగన్ ప్రతాప్

ఖమ్మం జులై (పున్నమి న్యూస్) సంత్ గురు రవిదాస్ జయంతి సందర్భంగా పాలేరు అసెంబ్లీ పరిధిలోని ఎదులపురం మున్సిపాలిటీలో బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రవిదాస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు బండ్ల రీగన్ ప్రతాప్ మాట్లాడుతూ, సమానత్వం, కులరహిత సమాజ నిర్మాణానికి గురు రవిదాస్ బోధనలు స్ఫూర్తిదాయకమని అన్నారు. దళిత, వెనుకబడిన వర్గాల సాధికారత కోసం ఆయన ఆశయాల ప్రచారాన్ని కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా నాయకులు, మండల అధ్యక్షుడు సత్తి నాగరాజు పాల్గొన్నారు.

ఖమ్మం జులై
(పున్నమి న్యూస్)

సంత్ గురు రవిదాస్ జయంతి సందర్భంగా పాలేరు అసెంబ్లీ పరిధిలోని ఎదులపురం మున్సిపాలిటీలో బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రవిదాస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు బండ్ల రీగన్ ప్రతాప్ మాట్లాడుతూ, సమానత్వం, కులరహిత సమాజ నిర్మాణానికి గురు రవిదాస్ బోధనలు స్ఫూర్తిదాయకమని అన్నారు. దళిత, వెనుకబడిన వర్గాల సాధికారత కోసం ఆయన ఆశయాల ప్రచారాన్ని కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా నాయకులు, మండల అధ్యక్షుడు సత్తి నాగరాజు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.