రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 21 (పున్నమి ప్రతినిధి): అభ్యుదయ కవితా పితామహుడు, వాడుక భాషా వ్యాప్తికి, సామాజిక సంస్కరణలకు తన రచనల ద్వారా కృషి చేసిన గురజాడ అప్పారావు జయంతి సందర్భంగా రాజమహేంద్రవరంలోని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఐఏఎస్, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్ మేఘా స్వరూప్ ఐఏఎస్, గురజాడ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా గురజాడ అప్పారావు తెలుగు సాహిత్యానికి, వాడుక భాష ఉద్యమానికి, సామాజిక చైతన్యానికి అందించిన సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా అధికారులు, నాయకులు పాల్గొన్నారు.



