Friday, 22 May 2026
  • Home  
  • గిరిజనుల సంరక్షకుడు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి-తుపాకుల ప్రసాద్
- తిరుపతి

గిరిజనుల సంరక్షకుడు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి-తుపాకుల ప్రసాద్

శ్రీ కాళహస్తి, మే 22, (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యుడు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న గిరిజనుల సంరక్షకుడని తెలుగుదేశం పార్టీ గిరిజన విభాగం నాయకుడు తుపాకుల ప్రసాద్ కొనియాడారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని నియోజకవర్గ గిరిజనుల తరఫున ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా ఆయన చిత్రపటాన్ని చేతబూని, చిన్నారుచే కేక్ కట్ చేయించి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా తుపాకుల ప్రసాద్ మాట్లాడుతూ.. పేద ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తున్న సుధీర్ రెడ్డికి రాజకీయంగా, ప్రభుత్వపరంగా మరిన్ని ఉన్నత పదవులు దక్కాలని ఆకాంక్షించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించడానికి శ్రీ జ్ఞానప్రసూనాంబికా దేవి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆశీస్సులు ఆయనకు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్, టీడీపి రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ జి.దశరథాచారి, వన్నెకుల క్షత్రియ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ మిన్నల్ రవి, బీసీ విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ ఎం.ఉమేష్ రావు, తంగేళ్ళపాలెం పీఏసీఎస్ ఛైర్మన్ బీమాల భాస్కర్, పట్టణ కార్యనిర్వాహక కార్యదర్శి వజ్రం కిషోర్, నాయీ బ్రాహ్మణ సాధికార సమితి తిరుపతి పార్లమెంట్ సోషల్ మీడియా కన్వీనర్ కోట చంద్రశేఖర్, తొట్టంబేడు మండల ప్రధాన కార్యదర్శి చిల్లకూరు మణి పాల్గొన్నారు. అలాగే తిరుపతి పార్లమెంట్ నాయకులు సులేమాన్, గంగనపల్లి రమేష్, కృష్ణమూర్తితో పాటు గిరిజన విభాగం నాయకులు మారయ్య, మునెమ్మ, వెంకటరమణ, గంగమ్మ, రోజా తదితరులు పాల్గొని ఎమ్మెల్యేకు జన్మదిన అభినందనలు తెలియజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.