Friday, 31 July 2026
  • Home  
  • గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకున్న థిoసా నృత్యం
- విజయనగరం 

గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకున్న థిoసా నృత్యం

గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించుకున్న థింసా నృత్యం భోగాపురం ఎయిర్పోర్ట్ లో ఆవిష్కృతమైన అద్భుత నృత్యం గిరిజన సంక్షేమ శాఖామంత్రి గుమ్మిడి సంధ్యారాణి కి సర్టిఫికెట్ ను అందజేసిన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ బృందం విజయనగరం జిల్లా బ్యూరో /రమణ, జూలై 31.( పున్నమి ప్రతినిధి ) ​భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం దేశం లోనే అత్యధికంగా 13వేల మంది గిరిజన బాలికలతో ప్రదర్శించిన థింసా నృత్యం గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదయ్యింది. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ ప్రతినిధులు ప్రత్యక్షంగా థింసా నృత్యాన్ని తిలకించి సంతృప్తినీ వ్యక్తం చేశారు. అనంతరం వరల్డ్ రికార్డ్స్ కు సంబంధించిన సర్టిఫికెట్ ను గిరిజన సంక్షేమ శాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కి అందజేశారు. ఉత్తరాంధ్ర సంస్కృతి, సాంప్రదాయాల విశిష్టతను ప్రపంచానికి చాటిచెప్పేలా ఈ వేడుకను ఘనంగా నిర్వహించారు. ​13,000 మంది పైబడి గిరిజన మహిళలు మరియు విద్యార్థినులు ఏకకాలంలో సంప్రదాయ థింసా నృత్యాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా గిరిజన సంక్షే శాఖ ముఖ్య కార్యదర్శి ఎం. ఎం.నాయక్ మాట్లాడుతూ 13వేల మంది బాలికలతో థింసా ప్రదర్శించడం చరిత్రాత్మకమని, లండన్ నుండి విచ్చేసిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ టీమ్ నృత్యాన్ని తిలకించి అభినందించారని తెలిపారు. నృత్య ఏర్పాటు లో అనేక మంది సహకారం అందించారని అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం లో ప్రధాని పర్యటన నోడల్ అధికారి కృష్ణ బాబు, జిల్లా కలెక్టర్ ఎస్. రాం సుందర్ రెడ్డి, గిరిజన సంక్షే శాఖ డైరెక్టర్ ఎస్. భార్గవి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రధానికి రేపు థింసా తో స్వాగతం ఆగస్టు 1న ఓపెన్ టాప్ జీపులో విచ్చేయనున్న ప్రధాని నరేంద్ర మోదీ కి ఈ సాంప్రదాయ నృత్యంతో ఘనంగా స్వాగతం పలకనున్నారు. ప్రధానికి స్పష్టంగా కనిపించేలా కళాకారులను 433 బృందాలుగా విభజించి, వృత్తాకారంలో నిలబెట్టేలా ప్రణాళిక రూపొందించారు. ఒక్కో వృత్తం లో 50 మంది చొప్పున నృత్యం చేసేలా ఏర్పాట్లు చేశారు. ప్రదర్శనలో పాల్గొనే కళాకారులందరూ ఆకుపచ్చ బోర్డర్‌తో కూడిన పింక్ రంగు చీర, గ్రీన్ జాకెట్ ధరించి ఏకరూపతతో అలరించనున్నారు. ​

గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించుకున్న థింసా నృత్యం
భోగాపురం ఎయిర్పోర్ట్ లో ఆవిష్కృతమైన అద్భుత నృత్యం
గిరిజన సంక్షేమ శాఖామంత్రి గుమ్మిడి సంధ్యారాణి కి సర్టిఫికెట్ ను అందజేసిన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ బృందం

విజయనగరం జిల్లా బ్యూరో /రమణ, జూలై 31.( పున్నమి ప్రతినిధి )

​భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం దేశం లోనే అత్యధికంగా 13వేల మంది గిరిజన బాలికలతో ప్రదర్శించిన థింసా నృత్యం గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదయ్యింది. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ ప్రతినిధులు ప్రత్యక్షంగా థింసా నృత్యాన్ని తిలకించి సంతృప్తినీ వ్యక్తం చేశారు. అనంతరం వరల్డ్ రికార్డ్స్ కు సంబంధించిన సర్టిఫికెట్ ను గిరిజన సంక్షేమ శాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కి అందజేశారు.

ఉత్తరాంధ్ర సంస్కృతి, సాంప్రదాయాల విశిష్టతను ప్రపంచానికి చాటిచెప్పేలా ఈ వేడుకను ఘనంగా నిర్వహించారు.

​13,000 మంది పైబడి గిరిజన మహిళలు మరియు విద్యార్థినులు ఏకకాలంలో సంప్రదాయ థింసా నృత్యాన్ని ప్రదర్శించారు.

ఈ సందర్భంగా గిరిజన సంక్షే శాఖ ముఖ్య కార్యదర్శి ఎం. ఎం.నాయక్ మాట్లాడుతూ 13వేల మంది బాలికలతో థింసా ప్రదర్శించడం చరిత్రాత్మకమని, లండన్ నుండి విచ్చేసిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ టీమ్ నృత్యాన్ని తిలకించి అభినందించారని తెలిపారు. నృత్య ఏర్పాటు లో అనేక మంది సహకారం అందించారని అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమం లో ప్రధాని పర్యటన నోడల్ అధికారి కృష్ణ బాబు, జిల్లా కలెక్టర్ ఎస్. రాం సుందర్ రెడ్డి, గిరిజన సంక్షే శాఖ డైరెక్టర్ ఎస్. భార్గవి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ప్రధానికి రేపు థింసా తో స్వాగతం

ఆగస్టు 1న ఓపెన్ టాప్ జీపులో విచ్చేయనున్న ప్రధాని నరేంద్ర మోదీ కి ఈ సాంప్రదాయ నృత్యంతో ఘనంగా స్వాగతం పలకనున్నారు.

ప్రధానికి స్పష్టంగా కనిపించేలా కళాకారులను 433 బృందాలుగా విభజించి, వృత్తాకారంలో నిలబెట్టేలా ప్రణాళిక రూపొందించారు. ఒక్కో వృత్తం లో 50 మంది చొప్పున నృత్యం చేసేలా ఏర్పాట్లు చేశారు.

ప్రదర్శనలో పాల్గొనే కళాకారులందరూ ఆకుపచ్చ బోర్డర్‌తో కూడిన పింక్ రంగు చీర, గ్రీన్ జాకెట్ ధరించి ఏకరూపతతో అలరించనున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.